మరో నాలుగు మండలాల్లో దళిత బంధు

ABN , First Publish Date - 2021-09-01T19:21:43+05:30 IST

హుజురాబాద్‌తోపాటు మరో నాలుగు మండలాల్లో దళిత బంధును అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

మరో నాలుగు మండలాల్లో దళిత బంధు

హైదరాబాద్: హుజురాబాద్‌తోపాటు మరో నాలుగు మండలాల్లో దళిత బంధును అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి సమీక్ష చేస్తారు. రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో ఉన్న దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు దళితబంధును అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.


నాలుగు మండ‌లాలు ఇవే..

ఖ‌మ్మం జిల్లా, మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం, చింత‌కాని మండ‌లం 

సూర్యాపేట జిల్లా, తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం, తిరుమ‌ల‌గిరి మండ‌లం 

నాగర్‌క‌ర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గం, చార‌గొండ మండ‌లం   

కామారెడ్డి జిల్లా, జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గం, నిజాం సాగ‌ర్ మండ‌లం.. 

Updated Date - 2021-09-01T19:21:43+05:30 IST