పప్పుల పొడి

ABN , First Publish Date - 2020-09-05T19:32:23+05:30 IST

పల్లీలు - ఒక కప్పు, పుట్నాలు - అరకప్పు, నువ్వులు - అరకప్పు, ఎండుమిర్చి - నాలుగైదు, జీలకర్ర - అర స్పూన్‌, మెంతులు - ఐదు లేదా ఆరు, ఉ

పప్పుల పొడి

కావలసినవి: పల్లీలు - ఒక కప్పు, పుట్నాలు - అరకప్పు, నువ్వులు - అరకప్పు, ఎండుమిర్చి - నాలుగైదు, జీలకర్ర - అర స్పూన్‌, మెంతులు - ఐదు లేదా ఆరు, ఉప్పు - రుచికి తగినంత, ఇంగువ - చిటికెడు, నూనె - అర స్పూన్‌.


తయారీ విధానం: ముందుగా స్టవ్‌పై బాణలి పెట్టుకుని ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ, మెంతులు వేసి దోరగా వేగించుకుని పక్కన పెట్టుకోవాలి. పల్లీలు, పుట్నాలు, నువ్వుపప్పు వేర్వేరుగా వేగించుకోవాలి. ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, ఇంగువ కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత పల్లీలు, పుట్నాలు, నువ్వులు పొడి చేసుకోవాలి. చివరగా రుచికి తగినంత ఉప్పు  కలపాలి.ఈ పొడిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే రుచిగా ఉంటుంది.


వంద గ్రాముల వేరుశనగల్లో...

క్యాలరీలు - 567

ప్రొటీన్‌ - 25.8 గ్రా

కార్బోహైడ్రేట్లు - 16.1 గ్రా

ఫైబర్‌ - 8.5 గ్రా

ఫ్యాట్‌ - 49.2గ్రా


మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు వేరుశనగలు సహాయపడతాయి. తద్వారా మలబద్ధకం దరిచేరదు. గుండె సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి.


పంపినవారు

మోహిని ఆచార్య 

హైదరాబాద్‌

ఫోన్‌ 9515088279


Updated Date - 2020-09-05T19:32:23+05:30 IST