దాల్‌ చిల్లా

ABN , First Publish Date - 2021-05-22T17:17:08+05:30 IST

పెసరపప్పు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - రుచికి తగినంత, ఆలివ్‌ ఆయిల్‌ లేదా నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, టోఫు -

దాల్‌ చిల్లా

కావలసినవి: పెసరపప్పు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - రుచికి తగినంత, ఆలివ్‌ ఆయిల్‌ లేదా నెయ్యి - రెండు  టేబుల్‌స్పూన్లు, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, టోఫు - 200గ్రా, ఉల్లిపాయలు - రెండు, పసుపు - అర టీస్పూన్‌.


తయారీ విధానం: ముందుగా పప్పును శుభ్రంగా కడిగి నీళ్లలో రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. స్టవ్‌పై వెడల్పాటి పాన్‌ పెట్టి నూనె లేదా నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక మిశ్రమాన్ని వెడల్పుగా స్పూన్‌తో దోశ లా పోసుకోవాలి. రెండు మూడు నిమిషాలు కాలిన తరువాత మరో వైపు తిప్పి కాల్చుకోవాలి. స్టవ్‌పై మరో పాన్‌ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగించాలి. తరువాత పసుపు వేసి తగినంత ఉప్పు వేయాలి. కాసేపు వేగిన తరువాత టోఫు వేసి మరో మూడు నాలుగు నిమిషాలు వేగించాలి. కొత్తిమీర వేయాలి. ఇప్పుడు కాల్చి పెట్టుకున్న చిల్లాలపై టోఫు మిశ్రమం పెట్టి సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-05-22T17:17:08+05:30 IST