సిద్ధమవుతున్న సభా వేదిక

ABN , First Publish Date - 2022-07-02T06:22:28+05:30 IST

సిద్ధమవుతున్న సభా వేదిక

సిద్ధమవుతున్న సభా వేదిక
ఏర్పాట్లు పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం, కలెక్టర్‌, అడిషనల్‌ డీజీపీ

 పరిశీలించిన డిప్యూటీ సీఎం, ప్రత్యేక కేంద్ర భద్రతా బృందం
భీమవరం/ కాళ్ల : ప్రధాని మోదీ బహిరంగ సభ కోసం పెదఅమిరంలోని ఎన్‌ఆర్‌ఐ అనంత కోటి రాజు లేఅవుట్‌లో ఏర్పాటు చేస్తున్న సభా వేదిక సిద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రానికి వేదికపై జర్మన్‌ టెక్నాలజీతో నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణం వేగంగా సాగుతోంది. వర్షం వచ్చినా సభావేదికకు ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక నిర్మాణ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్ర భద్రతా బృందం విభాగం సభ్యులు పరిశీలించారు. ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, కలెక్టర్‌ పి.ప్రశాంతితో పాటు పలువురు అధికారులు, క్షత్రియ పరిషత్‌ నాయకులు వేదికను పరిశీలించారు. ఏర్పాట్లు మరింత వేగంగా చేయాలని సూచించారు.

పటిష్ట బందోబస్తు
 సభకు పటిష్ట పోలీసు బందోబస్తు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అడిషనల్‌ డీజీపీ రవిశంకర్‌ అయ్యర్‌, డీఐజీ పాలరాజు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. భద్రతా చర్యలు, ఏర్పాట్లను వారు క్షేత్రస్థాయిలో పర్యటించి, పర్యవేక్షించారు.



వర్షంతో అవరోధం..అయినా ముందుకే..
రెండు రోజులుగా ఎండ కాసి గురువారం రాత్రి వర్షం కురవడంతో వేదిక ప్రాంతమంతా నీటితో నిండిపోయింది. వాటిని బయటకు పంపించారు. మళ్లీ ఎండ కాయడంతో పనులను వేగవంతం చేశారు. వేదిక ప్రాంతమంతా బ్లాక్‌ చిప్‌ పౌడర్‌తో పటిష్టపరుస్తున్నారు. సభకు వచ్చేవారి కోసం సుమారు 1.50 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 20వేల వాటర్‌ బాటిళ్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఆది, సోమవారాల్లో పెదఅమిరం నుంచి భీమవరం రెండో పట్టణ పరిధిలో అల్లూరి విగ్రహావిష్కరణ జరిగే ప్రాంతం వరకు ప్రత్యేక ట్రాఫి క్‌ నిబంధనలు అమల్లో ఉంటాయని పోలీస్‌శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు స్ధలంలో నాలుగు హెలీప్యాడ్లను ఆర్‌అండ్‌బీ అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2022-07-02T06:22:28+05:30 IST