కొనసాగుతున్న డెయిరీ ఉద్యోగుల దీక్షలు

ABN , First Publish Date - 2021-04-16T05:27:40+05:30 IST

ఒంగోలు డెయిరీ ఉద్యోగులు, కార్మికు లు తమ సమస్యల ను పరిష్కరించాల ని డిమాండ్‌ చే స్తూ స్థానిక కలెక్టరే ట్‌ వద్ద చేపట్టిన దీ క్షలు గురువారానికి 51వ రోజుకు చేరాయి. ఈ సందర్బంగా ఆర్థిక, మానసిక ఇబ్బందులతో ఈనెల 13న మృతిచెందిన డెయిరీ ఉద్యోగి శ్రీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కొనసాగుతున్న డెయిరీ ఉద్యోగుల దీక్షలు
శ్రీదేవి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న డెయిరీ ఉద్యోగులు, కార్మికులు

ఒంగోలు(కలె క్ట రేట్‌), ఏప్రిల్‌ 15 : ఒంగోలు డెయిరీ ఉద్యోగులు, కార్మికు లు తమ సమస్యల ను పరిష్కరించాల ని డిమాండ్‌ చే స్తూ స్థానిక కలెక్టరే ట్‌ వద్ద చేపట్టిన దీ క్షలు గురువారానికి 51వ రోజుకు చేరాయి. ఈ సందర్బంగా ఆర్థిక, మానసిక ఇబ్బందులతో ఈనెల 13న మృతిచెందిన డెయిరీ ఉద్యోగి శ్రీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీక్ష శిబి రాన్ని సీఐటీయూ రాష్ట్ర నాయకులు వై.సిద్దయ్య, కాలం సుబ్బారావు ప్రారంభించారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్‌వేతనాలతో పాటు వీఆర్‌ఎస్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో ఎంవీ.సుబ్బారావు, శ్రీను, డి.శ్రీను పాల్గొన్నారు.


Updated Date - 2021-04-16T05:27:40+05:30 IST