పసికందు ప్రాణం కాపాడుకోవడానికి మీ సాయం కావాలి(ADVT)

ABN , First Publish Date - 2020-03-04T21:31:36+05:30 IST

ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు కనిపిస్తున్న ఆ పసికందు మోముపై చెయ్యేసి నవ్వుతోందా తల్లి. ఎంత దాచాలనుకున్నా ఆమె కళ్లలో కన్నీళ్లు మాత్రం ఉబికి వస్తూనే ఉన్నాయి.

పసికందు ప్రాణం కాపాడుకోవడానికి మీ సాయం కావాలి(ADVT)

ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు కనిపిస్తున్న ఆ పసికందు మోముపై చెయ్యేసి నవ్వుతోందా తల్లి. ఎంత దాచాలనుకున్నా ఆమె కళ్లలో కన్నీళ్లు మాత్రం ఉబికి వస్తూనే ఉన్నాయి. సడెన్‌గా యాభైఏళ్లు వయసు పెరిగినట్లు కుంగిపోయిన భుజాలతో, అలసిపోయిన శరీరంతో కూర్చుని ఉన్నారా తల్లిదండ్రులు. వారిని చూస్తేనే అంతులేని దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తోంది. అలా ఉన్న వారి వద్దకు ఓ నర్సు వచ్చింది. ఏదో చెప్తోంది గానీ, ఆ తల్లికి ఆ మాటలేమీ వినిపించడంలేదు. ఆ తర్వాత ఆమె ఒడిలోని పసివాడిని తను తీసుకుందా నర్సు. దీంతో ఈ లోకంలోకి వచ్చిన ఆ తల్లి ఆందోళనగా నర్సువైపు చూసింది. ప్రాణంతో సమానమైన బిడ్డను తీసుకెళ్తున్న ఆమె వెనకే వెళ్లబోయింది. అయితే పక్కనే ఉన్న భర్త ఆమెను ఆపాడు. అక్కడే కూర్చోబెట్టి ధైర్యం చెప్తున్నాడు. ఆమె నుంచి ఎటువంటి సమాధానమూ లేదు. ఆమె అసలు ఈ లోకంలోనే ఉన్నట్లు లేదు. భార్యను అలా చూసిన దుర్గాప్రసాద్‌కు అదిమిపట్టుకున్న కన్నీళ్లు ఎగసుకువచ్చాయి. చేతుల్లో మొహం దాచుకున్నాడు. అతని భార్య కల్యాణి.. పక్కనే దుఃఖిస్తున్న భర్తను ఓదార్చే పరిస్థితిలో కూడా లేదు. ఇలా కాసేపు గడిచిన తర్వాత.. మళ్లీ ఓ నర్సు ఆ తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. బిడ్డను కల్యాణికి ఇచ్చి పాలు పట్టించాలని చెప్పింది. తన చేతిలోకి బిడ్డ మళ్లీ వచ్చిన తర్వాతగానీ కల్యాణి ఈ లోకంలోకి రాలేదు. బిడ్డను ముద్దాడుతూ.. పాలు పట్టి జోలపాడుతూ మళ్లీ తన లోకంలో మునిగిపోయింది. కానీ కాసేపటికే మళ్లీ ఆ పసికందును మరో నర్సు తీసుకెళ్లిపోయింది. కొన్నిరోజులుగా ఈ దృశ్యం ఆ ఆస్పత్రిలో చాలా మనసులను కదిలించివేస్తోంది.


బాబు ఆపరేషన్‌కు సాయం చేసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి


రోజుకూలీగా పనిచేసే దుర్గాప్రసాద్‌కు కల్యాణితో వివాహమైంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు. ఆ తర్వాత కల్యాణికి గర్భం వచ్చింది. ఓ రోజు కల్యాణికి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఇంకా నెలలు నిండకుండానే నొప్పులు రావడంతో దుర్గాప్రసాద్‌ ఆందోళన చెందాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ కల్యాణి పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. అత్యవసరంగా సీ-సెక్షన్ చేసి ఆమెకు డెలివరీ చేశారు. కానీ విధి ఆ తల్లిదండ్రులను వెక్కిరించింది. పుట్టినప్పటి నుంచి ఆ పసికందు ప్రాణం కోసం పోరుడుతూనే ఉంది. దాంతో కనీసం కళ్లు కూడా తెరవని ఆ శిశువును ఎన్‌ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలా శరీరంలో శక్తి లేనట్లు ఉన్న బిడ్డను చూసి ప్రతిసారీ దుర్గాప్రసాద్ కళ్లు జలపాతాల్లా మారతాయి. చావుతో పోరాడుతున్న తన ముద్దుల బిడ్డను చూసి అతను రోదించని రోజు లేదు. ‘రోజంతా ఎదురు చూస్తే.. పిల్లాడిని కాసేపు కళ్లారా చూసుకునే అవకాశం దొరుకుతోంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో సంతోషంగా ఇళ్లకు వెళ్లడం చూస్తున్నా. నాకుమాత్రం అది తీరని కలే అయింది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు దుర్గాప్రసాద్. ఈ సమయంలో కల్యాణి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇతరులతో మాట్లాడటం కూడా ఆపేసింది. ప్రాణం కోసం తన బిడ్డ పోరాడుతుంటే నిస్సహాయంగా అలా చూస్తూ రోదిస్తోందామె. బిడ్డను ఎత్తుకొని గట్టిగా గుండెలకు హత్తుకోవాలనుందంటూ ఆమె దుఃఖిస్తుంటే రాళ్లు కూడా కరిగిపోతాయా అనిపిస్తోంది. ‘వాణ్ణి ఇంటికి తీసుకెళ్లి నా ప్రేమంతా వాడిపై కురిపించాలనుంది. అందరు తల్లుల్లానే పక్కనే ఉండి వాడు ఎదుగుతుంటే చూడాలనుంది’ అంటూ కన్నీళ్లతో ఆమె కోరుతుంటే ఎవరికైనా గుండెలు తరుక్కుపోవాల్సిందే. అయితే ఇంకొంతకాలం ఆ బిడ్డకు చికిత్స అందించక తప్పదని డాక్టర్లు చెప్తున్నారు. బిడ్డ వైద్యానికి 3.6లక్షల రూపాయలు ఖర్చవుతాయని వాళ్లు కల్యాణి దంపతులకు చెప్పారు. ఈ మాటలు విన్న ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచలేదు. తాము దాచుకున్న సొమ్మంతా శిశువు డెలివరీకి, ప్రాథమిక చికిత్సకే ఖర్చయిపోయిందని, ఇప్పుడు అంత సొమ్ము ఎలా సేకరించాలో తెలియడం లేదని కల్యాణి కన్నీరుమున్నీరవుతోంది. ‘రోజు కూలీగా పనిచేసే నా భర్త ఆ సొమ్ము సేకరించడం అసాధ్యం. దాతలెవరైనా చేయూతనిచ్చి ఆదుకోకపోతే.. నా చిన్నారి ప్రాణాలతో ఉండటం కష్టం. మీకు చేతులెత్తి అర్థిస్తున్నా.. నా పసికందును బతికించండి’ అంటూ వేడుకుంటోంది.

బాబు ఆపరేషన్‌కు సాయం చేసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి

పసిబిడ్డ చికిత్స కోసం ketto.orgలో విరాళాలు సేకరిస్తున్నారు. ఈ కింద ఉన్న లింక్ ద్వారా వీలైనంత ఆర్థిక సాయం చేసి.. కళ్లు కూడా తెరవని ఆ పసికందు ప్రాణాలు కాపాడటంలో సహకారం అందించండి.


బాబు ఆపరేషన్‌కు సాయం చేసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి


Updated Date - 2020-03-04T21:31:36+05:30 IST