ప్రతి రోజూ పుస్తకం చదవాలి

ABN , First Publish Date - 2020-12-06T04:13:12+05:30 IST

ప్రతిరోజూ పుస్తకం చదవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని జేసీ ఎన్‌. ప్రభాకర్‌రెడ్డి సూచించారు.

ప్రతి రోజూ పుస్తకం చదవాలి
లోగోను ఆవిష్కరిస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

‘చదవడం మాకిష్టం’  ప్రారంభంలో జేసీ 

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) డిసెంబరు 5:  ప్రతిరోజూ పుస్తకం చదవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని జేసీ ఎన్‌. ప్రభాకర్‌రెడ్డి సూచించారు. నగరంలోని ఈఎస్‌ఆర్‌ఎం నగరపాలక ఉన్నత పాఠశాలలో శనివారం ఆయన ‘చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని’ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాలు చదవడం ద్వారా అనేకమంది అనుభవాలు, అనుభూతి తెలుసుకోవచ్చన్నారు. ఎవరైతే ఎక్కువ పుస్తకాలు చదువుతారో వారు అనుభవశాలులు అవుతారని, పొరపాట్లు చేయకుండా ఉంటారని తెలిపారు. మనం సంతోషంగా ఉండటానికి అత్యుత్తమ సాధనం పుస్తకమే అన్నారు. విద్యార్థులు పుస్తకాల్లో ఆనందాన్ని వెతికి చదివితే తప్పనిసరిగా గొప్పవారవుతారన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి, ఉపాధ్యాయులు విద్యార్థులకు పుస్తకాలు చదవడం అలవాటు చేయాలన్నారు. డీఈవో పి.రమేష్‌ మాట్లాడుతూ విద్యార్థులో పఠనాసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నిర్దేశిత షెడ్యుల్‌ ప్రకారం ఈ ఏడాది నవంబరు  నుంచి  2021 నవంబరు వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు.అనంతరం జేసీ చదవడం మాకిష్టం లోగో, బ్రౌచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి యస్‌ నాగమోహన్‌రెడ్డి, ఎంఈవో రహీమ్‌  పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T04:13:12+05:30 IST