రోజుకు ఏడు వేల పరీక్షలు

ABN , First Publish Date - 2020-10-20T06:54:00+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు19: జిల్లాలో కొవిడ్‌-19కు సంబంధించి రోజుకు సగటున ఏడు వేల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు జేసీ చేకూరి కీర్తి తెలిపారు.

రోజుకు ఏడు వేల పరీక్షలు

రేపటి నుంచి  మాస్కుపై అవగాహన : జేసీ
డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు19: జిల్లాలో కొవిడ్‌-19కు సంబంధించి రోజుకు సగటున ఏడు వేల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు జేసీ చేకూరి కీర్తి తెలిపారు. సోమవారం వెలగపూడి నుంచి ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొవిడ్‌-19 ఉద్యోగ నియామకాలు, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ వంటి అంశాలపై జేసీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రస్తుత పరిస్థితని జేసీ కీర్తి మంత్రికి వివరించారు. ఇటీవల కాకినాడ, రాజమహేంద్రవరంలలో పాజిటివ్‌ కేసులు బాగా తగ్గాయని తెలిపారు. అమలాపురం, రామచంద్రపురంలో కొంచెం ఎక్కువ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరీక్షల సంఖ్యను పెంచుతున్నామన్నారు. మరణాలు నమోదవుతున్న మండలాలపైన ప్రత్యేకంగా దృష్టి సారి స్తున్నామన్నారు. కేసుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో మాస్కుల వినియోగంపై అజాగ్రత్త కనిపిస్తోందని, అందువల్ల ఈనెల 21 నుంచి పది రోజులపాటు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామన్నారు. ఈ సమావేశంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం రాఘవేంద్రరావు, రంగరాయ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె బాబ్జి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-20T06:54:00+05:30 IST