ఆధునిక డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు అభినందనీయం

ABN , First Publish Date - 2020-11-30T06:14:06+05:30 IST

జిల్లా ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళకుండా అధునా తన పరిజ్ఞానంతో సిటిస్కాన్‌, ఆలా్ట్రసౌండ్‌, ఎక్స్‌రే వంటి యంత్రాలతో ఒంగోలులో డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమ ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ఆధునిక డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు అభినందనీయం
డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి బాలినేని, పక్కన సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే బలరాం

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి


ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 29 : జిల్లా ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళకుండా అధునా తన పరిజ్ఞానంతో సిటిస్కాన్‌, ఆలా్ట్రసౌండ్‌, ఎక్స్‌రే వంటి యంత్రాలతో ఒంగోలులో డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమ ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్థానిక సుందరయ్యభవన్‌ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ముందుగా సెంటర్‌ ని ర్వహకులు డాక్టర్‌ కృష్ణసాహిత్‌రెడ్డి మంత్రి బాలి నేనికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, నందికో ట్కూరు వైపీపీ ఇన్‌చార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, చైత న్య హాస్పటల్‌ ఎండీ డాక్టర్‌ ఆర్‌ఎం.ప్రసాద్‌, ఐ ఎంఏ అధ్యక్షుడు ఎం.వీరయ్యచౌదరి, రమేష్‌ సం ఘమిత్ర ఎండీ డాక్టర్‌ దుంపా తిరుమలరెడ్డి, వై సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు త దితరులు పాల్గొన్నారు. 


ఇంక్యూబలేటర్‌ యంత్రాల బహూకరణ


స్థానిక ప్రభుత్వ మాతా శిశు వైద్యశాలకు మాజీ సైనికులు విరాళంగా ఇచ్చిన రెండు ఇం క్యూబలేటర్ల యంత్రాలు, ఫొటో తెరిపి యూనిట్‌ లను మంత్రి బాలినేని ప్రారంభించారు. మాజీ సైనికులను ఆయన అభినందించారు. కార్యక్ర మంలో నేషనల్‌ ఎక్స్‌సర్వీస్‌ మెన్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నెప్పల్లి నాగేశ్వరరా వు, ప్రధానకార్యదర్శి వెంకటరెడ్డి, క్యాంటిన్‌ మేనే జర్‌ వెంకట్రావు, జి.కోటేశ్వరరరావు పాల్గొన్నారు. 


పొగాకు రైతులకు అండగా ఉంటాం 


పొగాకు రైతులకు అండగా ఉంటామని, ఇం దుకోసం గుంటూరు టుబాకో గ్రోయర్స్‌ అండ్‌ క్యూరర్స్‌ మార్కెటింగ్‌ సొసైటీ భవనాన్ని రూ.6 కోట్లతో నిర్మిస్తున్నట్లు మంత్రి బాలినేని శ్రీనివా సరెడ్డి తెలిపారు. స్థానిక భాగ్యనగర్‌లో నిర్మిస్తు న్న సొసైటీ భవనాన్ని ఆదివారం ఆయన పరిశీ లించారు. ఆయన వెంట సొసైటీ అధ్యక్షుడు తా టపర్తి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.   


చెరువు కట్టలు తెగకుండా చర్యలు 

 

చెరువు కట్టలు తెగకుండా ఇరిగేషన్‌ అధికా రులు చర్యలు తీసుకోవాలని మంత్రి బాలినేని శ్రీ నివాసరెడ్డి ఆదేశించారు. టంగుటూరు మండలం కొణిజేడు గ్రామంలోని ఇరిగేషన్‌ చెరువుకు గం డిపడిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి ఆ దివారం కలెక్టర్‌ పోలా భాస్కర్‌, ఇరిగేషన్‌ అధి కారులతో మాట్లాడారు. కొణిజేడు గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకో వాలన్నారు. తుపాను ప్రభావంతో జిల్లాలో చెరు వులన్నీ నిండాయని, వాటి కరకట్టలు దెబ్బతిన కుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


Updated Date - 2020-11-30T06:14:06+05:30 IST