May 14 2021 @ 05:57AM

చేసిన తప్పులు తెలుసుకున్నా: అభిరామ్‌ దగ్గుబాటి

క్యాస్టింగ్‌ కౌచ్‌, శ్రీరెడ్డితో సంబంధం విషయంలో వార్తల్లో నిలిచారు డి.సురేశ్‌బాబు రెండో కుమారుడు అభిరామ్‌. దానితోపాటు అతనిది చాలా ర్యాష్‌ డ్రైవింగ్‌ అనే ఆరోపణలూ ఉన్నాయి. త్వరలో తేజ దర్శకత్వంలో ‘చిత్రం 1.1’తో హీరోగా పరిచయం కానున్న ఆయన తను చేసిన తప్పులు తెలుసుకున్నానని చెబుతున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ‘‘తప్పులు అందరూ చేస్తారు. నేను చేసిన తప్పులు బయటికొచ్చాయి. నేను చేసిన తప్పులేంటో తెలుసుకున్నా. ఆ అనుభవంతో నాలో మార్పు వచ్చింది. వాటి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆ సమయంలో కుటుంబమే అండగా నిలిచింది. ఇప్పుడు ఏ పనులు చేయాలి? ఏది చేయకూడదు? అనే విషయాలు బాగా తెలిశాయి. అంత నా మంచికే అనుకుంటున్నా’’ అని అన్నారు. ఇక తేజ దర్శకత్వంలో హీరోగా పరిచయం కాబోతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతో వర్క్‌ చేయడానికి కాస్త భయంగా కూడా ఉందని చెప్పారు.  ‘‘నేనే రాజు నేనే మంత్రి’ సమయంలో నా కోసం కథ రాస్తానని చెప్పారు. కొవిడ్‌ తీవ్రత తగ్గాక సెట్‌లో అడుగుపెడతాను’ అన్నారు అభిరామ్‌.