అధిక ధరలతో సామాన్యుడిపై భారం

ABN , First Publish Date - 2022-08-08T02:55:56+05:30 IST

అధిక ధరలతో రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడిపై అధిక భారం మోపుతోందని రాష్ట్ర ఇరిగేషన్‌ బోర్డు మాజీ చైర్మన్‌, టీడీపీ సీనియర్‌ నేత మాలేపాటి రవీంద్రనాయుడు పేర్కొన్నారు.

అధిక ధరలతో సామాన్యుడిపై భారం
కరపత్రాలు పంపిణీ చేస్తున్న మాలేపాటి రవీంద్రనాయుడు

దగదర్తి, ఆగస్టు 7: అధిక ధరలతో రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడిపై అధిక భారం మోపుతోందని రాష్ట్ర ఇరిగేషన్‌ బోర్డు మాజీ చైర్మన్‌, టీడీపీ సీనియర్‌ నేత మాలేపాటి రవీంద్రనాయుడు పేర్కొన్నారు. పెరిగిన ధరలపై తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని శనివారం మండలంలోని శ్రీరామపురం(పెదపుత్తేడు) పంచాయతీలోని ఉప్పలపాడు, రామలింగాపురం, గొట్లపాళెం, ప్యాడ్సన్‌ పేట, తిరివీధిపాడు పంచాయతీల్లో నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ.. పెరిగిన నిత్యావసరాలు, ఆయిల్‌, గ్యాస్‌ ధరలు, ఆర్టీసీ, కరెంటు చార్జీలు తదితరాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో ధరలు.. ప్రస్తుతం ఉన్న ధరలపై ప్రజలకు వివరించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఒక చేత్తో ఉచిత పథకాలు ఇస్తూ.. మరో చేతితో ధరలు పెంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు అల్లం హనుమంతురావు, కంచర్ల కృష్ణ, వెంటకప్రసాదు, వెంకటేశ్వర్లు, చక్రపాణి, రమణమ్మ, మల్లికార్జున, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T02:55:56+05:30 IST