Sep 21 2021 @ 01:05AM

నాన్న నాతోనే ఉన్నట్లుంది

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా  ‘బంగార్రాజు’ చిత్రంలోని తన పాత్ర, దాని లుక్‌కు సంబంధించిన విశేషాలను నాగార్జున సోమవారం విడుదల చేసిన స్పెషల్‌ వీడియోలో వివరించారు. ‘సెప్టెంబర్‌ 20 నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. నా హీరో, స్ఫూర్తి ప్రదాత నాన్నగారి పుట్టిన రోజు. ఆయనకు పంచె కట్టు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పొందూరు ఖద్దరు ఇంకా ఇష్టం. ఇప్పుడు నేను ‘బంగార్రాజు’ చిత్రంలో కట్టుకున్నది కూడా పొందూరు ఖద్దరే. అలాగే నవరత్నాల హారం, నవరత్నాల ఉంగరం, నేను పెట్టుకున్న వాచీ ... ఇవన్నీ నాన్నగారు వాడినవే. అందుకే ఇవన్నీ వేసుకుంటే ఆయన నాతో ఉన్నట్లుగానే ఉంది. నాన్నగారి పంచెకట్టు అందాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసమే ఈ ప్రయత్నమంతా.ఏయన్నార్‌ లివ్స్‌ ఆన్‌’ అని తెలిపారు నాగార్జున. 


‘బంగార్రాజు’ చిత్రంలో నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు.