నాన్న.. ప్రపంచాన్ని మార్చేశాడు: జార్జ్ ఫ్లాయిడ్ కుమార్తె వీడియో వైరల్!

ABN , First Publish Date - 2020-06-04T05:13:51+05:30 IST

అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి కలకలం రేపుతోంది.

నాన్న.. ప్రపంచాన్ని మార్చేశాడు: జార్జ్ ఫ్లాయిడ్ కుమార్తె వీడియో వైరల్!

మినియాపోలిస్: అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి కలకలం రేపుతోంది. ఈ  మృతికి నిరసనగా ప్రజలంతా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎన్‌బీఏ ప్లేయర్ స్టీఫెన్ జాక్సన్ సీనియర్ షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. ఈ వీడియోలో జార్జ్ కుమార్తె జియాన్నా తండ్రి ప్రపంచాన్ని మార్చేశాడని అంటోంది. ఆరేళ్ల ఆ పాప చెప్తున్న ఆ మాటలు అక్షర సత్యాలని స్టీఫెన్ పేర్కొన్నాడు. ఈ వీడియోలో తండ్రి భుజాలపై కూర్చున్న జియాన్నా.. ‘నాన్న ప్రంపంచాన్ని మార్చేశాడు’ అంటోంది. ఈ వీడియో షేర్ చేసిన స్టీఫెన్.. ‘నిజం చెప్పావ్ తల్లీ.. నాన్న ప్రపంచాన్ని మార్చేశాడు. జార్జ్ ఫ్లాయిడ్ అనేది మార్పుకు మారుపేరు’ అని పోస్ట్ చేశాడు.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2020-06-04T05:13:51+05:30 IST