Abn logo
Sep 29 2020 @ 01:22AM

నాన్న, బాలుగారు మంచి స్నేహితులు

Kaakateeya

‘‘నా చిన్నతనంలో ఆయన పాడటానికి వచ్చినప్పుడు నేను చూడటానికి వెళ్లేవాణ్ణి. పాడేటప్పుడు ఆయన గొంతు మారుస్తున్నారనీ, మిమిక్రీ చేస్తున్నారనీ అనేవారు. అందుకని, ఆసక్తిగా వెళ్లేవాణ్ణి. ఎన్ని రోజులు కొనసాగుతారో చూద్దామని చాలామంది అనేవారు. కొన్ని దశాబ్దాలు ఆయన కొనసాగారు. గాయకుడిగా ఆయనది అద్భుతమైన ప్రయాణం. ఇండియాలో ఆయనలాంటి దిగ్గజ గాయకుడు ఎవరూ లేరు. ప్రపంచంలో ఆయన అంత సక్సెస్‌ఫుల్‌ సింగర్‌ ఎవరూ లేరు అనుకుంట. నాన్నగారు, బాలుగారు మంచి స్నేహితులు. మా సినిమాల్లో పాటలు పాడటమే కాదు... ‘ప్రేమ’లో నటించారు. మా సంస్థలో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. నాన్నగారు (డి.రామానాయుడు) మరణించడానికి ముందు ఆయన్ను చూడటానికి వచ్చారు. ‘బాలు.. కథ చూడు. నువ్వు డైరెక్షన్‌ చేయాలి’ అని నాన్న అన్నారు. వెంకటేశ్‌, బాలుగారు కూడా మంచి ఫ్రెండ్స్‌. ఇద్దరూ కలిసి ‘పవిత్ర బంధం’లో నటించారు. మూవీ టవర్స్‌ కన్స్‌ట్రక్షన్‌ గురించి ఆయన తాపత్రయపడ్డారు. నేను ప్రెసిడెంట్‌ అయిన తర్వాత దాన్ని పూర్తి చేసినప్పుడు చాలా సంతోషించారు. ఆయన దగ్గర సరస్వతి ఉంది. భాషలకు అతీతంగా ఆయన విజయాలు సాధించారు.’’ 

- నిర్మాత డి. సురేశ్‌బాబు


Advertisement
Advertisement