Abn logo
Oct 25 2020 @ 07:33AM

దాచేపల్లి మార్కెట్‌యార్డు చైర్మన్‌‌గా గొట్టెముక్కల సుబ్బమ్మ ప్రమాణ స్వీకారం

Kaakateeya

దాచేపల్లి(గుంటూరు): దాచేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం శనివారం జరిగింది. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నడికుడి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటుచేసిన సభలో చైర్మన్‌గా ముత్యాలంపాడు గ్రామానికి చెందిన గొట్టెముక్కల సుబ్బమ్మ, వైస్‌ చైర్మన్‌గా గొట్టెముక్కల పెదహనిమిరెడ్డి, మరికొంతమంది డైరెక్టర్లు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా గురజాల ఎమ్మెల్యే కాసుమహే్‌షరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  


Advertisement
Advertisement