Abn logo
Oct 19 2021 @ 21:42PM

దాడులకు దిగడం అమానుషం : పాశిం

19 జీడీఆర్‌ 8: నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌, టీడీపీ నాయకులు దాడులకు దిగడం అమానుషం : పాశిం గూడూరు, అక్టోబరు 19: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంపైనా, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపైనా వైసీపీ మూకలు మంగళవారం దాడులకు దిగడమ అమానుష చర్య అని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం స్థానిక గమళ్లపాళెంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద వైసీపీ దాడులను ఖండిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచక పాలన సాగుతుందన్నారు. అప్రజాస్వామికంగా దాడులకు దిగడం మంచిపద్ధతి కాదన్నారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తు న్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

గూడూరు, అక్టోబరు 19: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంపైనా, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపైనా వైసీపీ మూకలు మంగళవారం దాడులకు దిగడమ అమానుష చర్య అని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం స్థానిక గమళ్లపాళెంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద వైసీపీ దాడులను ఖండిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచక పాలన సాగుతుందన్నారు. అప్రజాస్వామికంగా దాడులకు దిగడం మంచిపద్ధతి కాదన్నారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తు న్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.