విద్యుత్తు ఉద్యోగులకు డీఏ పెంపు

ABN , First Publish Date - 2020-08-15T09:58:58+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందే విద్యుత్తు ఉద్యోగులకు తీపి కబురు అందింది. ..

విద్యుత్తు ఉద్యోగులకు డీఏ పెంపు

12.866ు నుంచి 16.158శాతానికి డీఏ


హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందే విద్యుత్తు ఉద్యోగులకు తీపి కబురు అందింది. ఉద్యోగులకు డీఏ (కరువు భత్యం) పెరిగింది. ప్రస్తుతం 12.866ు ఉన్న డీఏ.. పెంపుదలతో 16.158 శాతానికి చేరింది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి కొత్త డీఏ అమల్లోకి రానుంది. విద్యుత్తు ఉద్యోగులు, అధికారులతో పాటు ఆర్టిజన్లు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు కొత్త కరువు భత్యం వర్తింపచేస్తూ శుక్రవారం ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఉత్తర్వులు ఇచ్చారు.


పెరిగిన డీఏను ఆగస్టు నెల వేతనం కింద సెప్టెంబరు ఒకటో తేదీన నగదు రూపంలో ఇవ్వనున్నారు. జూలై బకాయిలు కూడా ఆగస్టు నెల వేతనంలో కలిపి ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 2019 జూలై, 2020 జనవరి, జూలైలో కలిపి 3 డీఏలు ఇవ్వాల్సి ఉండగా.. పెండింగ్‌లో పెట్టారు. 

Updated Date - 2020-08-15T09:58:58+05:30 IST