డీమార్ట్‌... భారీ కరెక్షన్‌...

ABN , First Publish Date - 2022-01-24T20:55:13+05:30 IST

డీమార్ట్‌లో రెండు రోజుల నుంచి భారీ సెల్లింగ్‌ కొనసాగుతోంది. గురువారం వరకు... ఎనిమిది సెషన్లలో 6.5 శాతం నష్టపోయిన ఈ స్టాక్‌... శుక్ర, సోమవారాల్లో కలిపి పది శాతం క్షీణించింది.

డీమార్ట్‌... భారీ కరెక్షన్‌...

ముంబై : డీమార్ట్‌లో రెండు రోజుల నుంచి భారీ సెల్లింగ్‌ కొనసాగుతోంది. గురువారం వరకు... ఎనిమిది సెషన్లలో 6.5 శాతం నష్టపోయిన ఈ స్టాక్‌... శుక్ర, సోమవారాల్లో కలిపి పది శాతం క్షీణించింది. దీంతో అవెన్యూ సూపర్‌మార్ట్‌ రిలేటివ్‌ స్ట్రెంట్‌ ఇండెక్స్‌ 30 దిగువకు పడిపోయింది. ఇక ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌ విషయానికొస్తే... 30 రోజుల సగటు వాల్యూమ్స్‌తో పోలిస్తే రెండు రెట్లు అధికంగా నమోదయ్యాయి. ఈ రోజు ఇంట్రాడేలో అవెన్యూ సూపర్‌మార్ట్‌ 7 శాతానికి పైగా నష్టపోయి డే కనిష్ట స్థాయి రూ. 4 వేల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ఆరు  శాతానికి పైగా నష్టంతో రూ. 4041.20 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ఈ రోజు... మధ్యాహ్నం వరకు  ఎన్‌ఎస్‌ఈలో 6.60 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విషయానికొస్తే... రూ. 2,61,840 కోట్లకు పడిపోయింది. కంపెనీ ఈపీఎస్‌ 22.84 కాగా, పీఈ 177.10 గా ఉంది. 

Updated Date - 2022-01-24T20:55:13+05:30 IST