సిలిండర్‌ పేలుడులో లిటన్‌ భార్యకు గాయాలు

ABN , First Publish Date - 2020-04-01T10:02:18+05:30 IST

ప్రమాదవశాత్తు ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్‌ పేలి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ లిటన్‌ దాస్‌ భార్య దేవశ్రీ బిస్వాస్‌ సంచిత (27) గాయపడింది. ప్రమాదం సంభవించిన రో జు ఆమె ‘టీ’ కాచేందుకు వంట గదిలోకి వెళ్లి గ్యాస్‌ ఆన్‌ చేయగా సిలిండర్‌ ఒక్కసారిగా పేలింది.

సిలిండర్‌ పేలుడులో లిటన్‌ భార్యకు గాయాలు

ఢాకా: ప్రమాదవశాత్తు ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్‌ పేలి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ లిటన్‌ దాస్‌ భార్య దేవశ్రీ బిస్వాస్‌ సంచిత (27) గాయపడింది. ప్రమాదం సంభవించిన రో జు ఆమె ‘టీ’ కాచేందుకు వంట గదిలోకి వెళ్లి గ్యాస్‌ ఆన్‌ చేయగా సిలిండర్‌ ఒక్కసారిగా పేలింది. ‘చావు దగ్గర వరకు వెళ్లి తప్పించుకున్నా. చేతులు అడ్డు పెట్టకుంటే ముఖమంతా కాలి పోయేది. వంట గదిలో గ్యాస్‌ సిలిండర్‌ ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు పాటించండి’ అని సంచిత తెలిపింది.

Updated Date - 2020-04-01T10:02:18+05:30 IST