సైయెంట్‌ లాభంలో 38% వృద్ధి

ABN , First Publish Date - 2022-01-21T08:26:17+05:30 IST

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సైయెంట్‌.. ఏకీకృత ప్రాతిపదికన రూ.131.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.95.4 కోట్లతో పోలిస్తే 38 శాతం..

సైయెంట్‌ లాభంలో 38% వృద్ధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సైయెంట్‌.. ఏకీకృత ప్రాతిపదికన రూ.131.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.95.4 కోట్లతో పోలిస్తే 38 శాతం పెరిగిందని సైయెంట్‌ ఎండీ, సీఈఓ కృష్ణ బోదనపు తెలిపారు. సమీక్ష త్రైమాసికానికి కంపెనీ ఆదాయం రూ.1,066.2 కోట్ల నుంచి రూ.1,205.5 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలలకు రూ.3,416 కోట్ల ఆదాయంపై రూ.368 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ వెల్లడించింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించిందని కృష్ణ అన్నారు. కంపెనీ వద్ద రూ.1,477 కోట్ల నగదు, నగదు సమానమైన నిల్వలు ఉన్నాయి. మొత్తం ఏడాదికి మార్జిన్లు మెరుగుపడగలవని కంపెనీ అంచనా వేస్తోంది.

Updated Date - 2022-01-21T08:26:17+05:30 IST