Andaman సముద్రంలో అల్పపీడనం...మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దు

ABN , First Publish Date - 2022-04-30T18:18:51+05:30 IST

దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది....

Andaman సముద్రంలో అల్పపీడనం...మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దు

చెన్నై:దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. మే 4వతేదీన దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడవచ్చని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) తెలిపింది.మే 4వతేదీన 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు దక్షిణ అండమాన్ సముద్రం,దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.ఈ తుపాన్ ప్రభావంతో మే 4వతేదీన అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. మే 4న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా గాలులు వీచే అవకాశముందని వారు తెలిపారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వివరించారు. 


Updated Date - 2022-04-30T18:18:51+05:30 IST