Abn logo
Jun 3 2020 @ 06:04AM

‘నిసర్గ’ తుపాన్ ఎఫెక్ట్: ముంబైకు 17 ఇండిగో విమానాల రాకపోకల రద్దు

ముంబై : ‘నిసర్గ’ తుపాన్ నేపథ్యంలో ముంబై నగరానికి బుధవారం రాకపోకలు సాగించాల్సిన 17 ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఆ విమానయాన సంస్థ ప్రకటించింది.బుధవారం ముంబై నుంచి కేవలం 3 విమానాలనే నడిపామని, 17 విమాన సర్వీసుల రాకపోకలను తుపాన్ వల్ల ముందుజాగ్రత్తచర్యగా రద్దు చేశామని ఇండిగో అధికార ప్రతినిధి తెలిపారు. ముంబై నుంచి చండీఘడ్, రాంచీ, పట్నాలకు మూడు ఇండిగో విమానాలను పంపించామని విమానయాన సంస్థ అధికారులు చెప్పారు. తుపాన్ హెచ్చరికలతో విస్తారా ఎయిర్ లైన్స్ కూడా ముంబైకు తమ విమానాల రాకపోకలను రద్దు చేసింది. విమాన ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాల రాకపోకలను రద్దు చేశామని విమానయాన సంస్థల అధికారులు చెప్పారు. తుపాన్ నేపథ్యంలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతపై విమానాశ్రయ అధికారులు సమావేశమై తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తల గురించి చర్చించారు. విమానాశ్రయం రన్ వేపై వరదనీరు నిలవకుండా పంపులను ఏర్పాటు చేశారు. 

Advertisement
Advertisement
Advertisement