తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్ బీభత్సం

ABN , First Publish Date - 2021-09-29T16:29:32+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్ బీభత్సం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. దీంతో పలు గ్రామాలకు జనజీవనంతో సంబంధాలు తెగిపోయాయి. రోడ్లు కోతకు గురయ్యాయి. వరద నీటి ప్రవాహనంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇంకా పలు గ్రామాలు అంథకారంలోనే ఉన్నాయి. ఎటు చూసినా వర్షపు నీరే ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


మరోవైపు గులాబ్ తుఫాన్ రైతులను ముంచింది. సుమారు రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరి, అరటి, పత్తి, మొక్కజొన్న, బొబ్బాయి పంటలు దెబ్బతిన్నాయి. అప్పు చేసి పంట సాగు చేస్తే నీటమునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అనేక చెరువులకు గండ్లు పడ్డాయి.


వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర ఒడిశా తీరానికి చేరుతుంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Updated Date - 2021-09-29T16:29:32+05:30 IST