విశాఖ: తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా 'అసాని' బలహీనపడింది. ప్రస్తుతం మచిలీపట్నంకు 40 కిలోమీటర్ల, కాకినాడకు 130 కిలోమీటర్ల, విశాఖ 272 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గురువారం ఉదయం వాయుగుండంగా తుఫాన్ బలహీనపడనుంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి.. ఏపీ తీరం సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. నేడు కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఇవి కూడా చదవండి