30 నిమిషాల్లో 33 ఫ్లోర్లు ఎక్కేశాడు.. ఫ్రెంచ్ సైక్లిస్ట్ కొత్త రికార్డ్

ABN , First Publish Date - 2021-01-26T19:26:52+05:30 IST

అపార్ట్‌మెంట్లలో, ఆఫీసుల్లో లిఫ్ట్ పనిచేయకపోతే రెండు, మూడు ఫ్లోర్లు ఎక్కడానికి కూడా చాలా మంది కష్టపడుతుంటారు.

30 నిమిషాల్లో 33 ఫ్లోర్లు ఎక్కేశాడు.. ఫ్రెంచ్ సైక్లిస్ట్ కొత్త రికార్డ్

పారిస్: అపార్ట్‌మెంట్లలో, ఆఫీసుల్లో లిఫ్ట్ పనిచేయకపోతే రెండు, మూడు ఫ్లోర్లు ఎక్కడానికి కూడా చాలా మంది కష్టపడుతుంటారు. కానీ.. ఫ్రాన్స్‌కు చెందిన  ఆరీలియన్ అనే సైక్లిస్ట్, మౌంటైన్ బైకర్ సైకిల్‌పై 33 ఫ్లోర్లు ఎక్కేశాడు. పైగా విశేషమేంటంటే.. 33 ఫ్లోర్లు ఎక్కేంత వరకు ఆరీలియన్ కాళ్లు కింద కూడా పెట్టలేదు. పోటో అనే ప్రాంతంలో ఉన్న ట్రినిటీ టవర్‌లో ఉన్న 33 ఫ్లోర్ల పైకి ఆరీలియన్ సైకిల్‌‌పై వెళ్లాడు. మొత్తంగా 768 మెట్లు ఎక్కాడు. అనంతరం కాళ్లు కింద పెట్టేయడంతో అక్కడితో ఆపేసి తన సైకిల్‌ను భూజాలపై పెట్టుకుని కిందకు వచ్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. తాము లిఫ్ట్ లేకుండా 30 ఫ్లోర్లు మెట్లు ఎక్కమంటేనే భయపడతామని, అలీరియన్ ఏకంగా సైకిల్‌పై వెళ్లడం నిజంగా రికార్డ్ అనే చెప్పాలంటూ కొనియాడుతున్నారు. 

Updated Date - 2021-01-26T19:26:52+05:30 IST