వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సైక్లోథాన్

ABN , First Publish Date - 2022-06-26T20:21:11+05:30 IST

ఒకప్పుడు సామాన్యుడి వాహనం సైకిల్ కు ఎంతో విలువ వుండేదని,సైక్లింగ్ మంచి ఆరోగ్యకరమైన అలవాటని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakara rao) అన్నారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సైక్లోథాన్

వరంగల్: ఒకప్పుడు సామాన్యుడి వాహనం సైకిల్ కు ఎంతో విలువ వుండేదని,సైక్లింగ్ మంచి ఆరోగ్యకరమైన అలవాటని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakara rao) అన్నారు.సైక్లింగ్ తో అనారోగ్య సమస్యలు దురం అవుతాయని వైద్యులు సూచిస్తున్నారని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కడం మంచి అలవాటని ఆయన అన్నారు.వరంగల్ పోలీస్ కమిషరేట్ లో  సైకిల్(cycle competition) పోటీలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి లతో కలిసి మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకటికి సైకిల్ తొక్కడం ప్రత్యేకంగా నేర్పే వారు.సైకిల్ ఇప్పటికీ చైనా లాంటి దేశాల్లో  విరివిగా వినియోగిస్తున్నారని తెలిపారు.ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు,పాల్గొంటున్న వాళ్లకు అభినందనలు తెలిపారు.ఈ సైక్లింగ్ పోటీ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, పలువురు ప్రముఖులు, పోటీ పడుతున్న యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, సీపీ తరుణ్ జోషి లతో కలిసి సైకిల్ తొక్కారు.


Updated Date - 2022-06-26T20:21:11+05:30 IST