లక్కీ డిప్‌ పేరిట బురిడీ..3.21 లక్షలు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు

ABN , First Publish Date - 2022-06-21T17:17:02+05:30 IST

మీషో ఆన్‌లైన్‌ సైట్లో టీ షర్టు ఆర్డర్‌ చేసిన వ్యక్తిని లక్కీడిప్‌ పేరుతో బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లు రూ. 3.21 లక్షలు కొల్లగొట్టారు. కూకట్‌పల్లికి చెందిన బాధితుడు

లక్కీ డిప్‌ పేరిట బురిడీ..3.21  లక్షలు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: మీషో ఆన్‌లైన్‌ సైట్లో టీ షర్టు ఆర్డర్‌ చేసిన వ్యక్తిని లక్కీడిప్‌ పేరుతో బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లు రూ. 3.21 లక్షలు కొల్లగొట్టారు. కూకట్‌పల్లికి చెందిన బాధితుడు మీషోలో రూ. 432తో టీషర్టు ఆర్డర్‌ చేశాడు. రెండు రోజుల్లో డెలివరీ చేస్తామంటూ మీషో ఎగ్జిక్యూటివ్‌ నుంచి అతడికి ఫోన్‌ వచ్చింది. కొద్దిసేపటికి మరో ఎగ్జిక్యూటివ్‌ ఫోన్‌ చేసి మీషో కస్టమర్స్‌ లక్కీడిప్‌లో రూ. 6.20 లక్షలు గెలుచుకున్నారని... ప్రతి రోజూ లక్కీడిప్‌ ద్వారా ఒకరిని ఎంపిక చేసి ప్రైజ్‌మనీ ఇస్తున్నామంటూ బురిడీ కొట్టించాడు. హెచ్‌ఎ్‌సబీసీకి చెందిన బ్యాంకు చెక్‌ను వాట్స్‌పలో పంపి నిజమని నమ్మించాడు. పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాలను వాట్సప్‌ ద్వారా బాధితుడి నుంచి తీసుకున్నాడు. జీఎస్టీ, ప్రాసెసింగ్‌ ఫీజు, ఇన్సూరెన్స్‌ చార్జీలు చెల్లించాలంటూ రూ. 3.21 లక్షలు వసూలు చేశాడు. డబ్బు తిరిగి మీ ఖాతాలోనే జమ చేస్తామని నమ్మించాడు. ఈలోగా మరో వ్యక్తి ఫోన్‌ చేసి టీడీఎస్‌ ట్యాక్స్‌ పేరుతో మరో రూ. 1.09 లక్షలు చెల్లించాలని, అవి కూడా రీఫండ్‌ చేస్తామని నమ్మించాడు. అనుమానం వచ్చిన బాధితుడు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-06-21T17:17:02+05:30 IST