పను సవాల్‌గా సైబర్‌ నేరాలు

ABN , First Publish Date - 2022-05-15T08:42:00+05:30 IST

సైబర్‌ నేరాలు ప్రపంచానికి పెను సవాల్‌ విసురుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు.

పను సవాల్‌గా సైబర్‌ నేరాలు

నేరాల నియంత్రణకు  సైబర్‌ ల్యాబ్‌ ఎకోసిస్టమ్‌ ఏర్పాటు: అమిత్‌ షా

రామంతాపూర్‌లో ఎన్‌సీఎఫ్‌ ల్యాబ్‌ ప్రారంభం

హైదరాబాద్‌/రామంతాపూర్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరాలు ప్రపంచానికి పెను సవాల్‌ విసురుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. ఈ నేరాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సైబర్‌ ల్యాబ్‌ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. సైబర్‌ నేరాల్లో శిక్షల శాతాన్ని పెంచేందుకు ఈ ఎకోసిస్టమ్‌ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ(సీఎ్‌ఫఎ్‌సఎల్‌) ప్రాంగణంలోని నేషనల్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీ(ఎన్‌సీఎ్‌ఫఎల్‌)ని అమిత్‌షా శనివారం ప్రారంభించారు. అనంతరం ఎన్‌సీఎ్‌ఫఎల్‌ను పరిశీలించారు. సీఎ్‌ఫఎ్‌సఎల్‌ ఉన్నతాధికారులతో మాట్లాడారు. 21వ శతాబ్దంలో సైబర్‌ నేరాలు సవాల్‌గా మారాయని, వాటిని విశ్లేషించడంలో ఎన్‌సీఎ్‌ఫఎల్‌ కీలకంగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎన్‌సీఎ్‌ఫఎల్‌ పనితీరును ఉన్నతాధికారులు ఆయనకు వివరించారు. రాష్ట్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లకు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేస్తుందని చెప్పారు. పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టిసారించి, పక్కా ఆధారాలతో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటుందని వివరించారు. కాగా, ఎన్‌సీఎ్‌ఫఎల్‌ ఏర్పాటుకు కేంద్రం రూ.35.31 కోట్లను మంజూరు చేసింది. ఈ ల్యాబొరేటరీలో మొబైల్‌ ఫోన్‌ ఎగ్జామినేషన్‌ యూనిట్‌, డిజిటల్‌ మీడియా స్టోరేజీ ఎగ్జామినేషన్‌ యూనిట్‌, అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ యూనిట్‌, క్రైమ్‌ సీన్‌ యూనిట్‌ పేర్లతో విభాగాలను ఏర్పాటు చేశారు. మొబైల్‌ ఫోన్‌, సిమ్‌, మెమరీ కార్డుల్లోని డేటాను రికవరీ చేసే సాంకేతికత.. పాడైన ఎలకా్ట్రనిక్‌ పరికరాల నుంచి కీలక సమాచారాన్ని బయటకు తీసే సదుపాయం ఇక్కడ ఉంది. ఇక సీఎ్‌ఫఎ్‌సఎల్‌కు మధ్యాహ్నం 3.30 గంటలకు వచ్చిన అమిత్‌ షా అరగంటలోనే కార్యక్రమాన్ని ముగించుకుని 4 గంటలకు తిరిగి వెళ్లారు. 

Updated Date - 2022-05-15T08:42:00+05:30 IST