పోలీసుల పనితీరులో Cyberabad టాప్‌

ABN , First Publish Date - 2022-05-29T16:12:38+05:30 IST

సైబరాబాద్‌ పోలీసులు తమ పనితీరులో ఉత్తమ ప్రతిభ కనబరిచి టాప్‌లో ..

పోలీసుల పనితీరులో Cyberabad టాప్‌

హైదరాబాద్‌ సిటీ : సైబరాబాద్‌ పోలీసులు తమ పనితీరులో ఉత్తమ ప్రతిభ కనబరిచి టాప్‌లో నిలిచినట్లు డీజీపీ కార్యాలయంలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ) ప్రకటించింది. ఈ మేరకు శనివారం డీజీపీ కార్యాలయం నుంచి నిర్వహించిన సీవోఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పోలీస్‌ టీమ్‌ను అభినందించారు. ఏప్రిల్‌ నెలకుగాను మొత్తం 22 వర్టికల్స్‌లో 15 వర్టికల్స్‌లో మొదటి స్థానంలో నిలిచి టాప్‌లోకి వెళ్లినట్లు తెలిపారు. కొన్ని నెలలుగా సీపీ స్టీఫెన్‌ రవీంద్ర (Stephen Ravindra) నేతృత్వంలో జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి పర్యవేక్షణలో రోజూ సిబ్బంది పనితీరును పర్యవేక్షించడంతోనే ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచినట్లు సైబరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. 

Updated Date - 2022-05-29T16:12:38+05:30 IST