హైదరాబాద్‌లో యువతిని ట్రాప్‌ చేసి...!

ABN , First Publish Date - 2021-07-01T20:16:15+05:30 IST

యువతిని ట్రాప్‌ చేసిన కేటుగాళ్లు

హైదరాబాద్‌లో యువతిని ట్రాప్‌ చేసి...!

  • యువతికి సైబర్‌ వల
  • ఉద్యోగం పేరిట రూ.7.45 లక్షలకు టోకరా

హైదరాబాద్/హిమాయత్‌ నగర్‌ : జాబ్‌ సైట్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న యువతిని ట్రాప్‌ చేసిన కేటుగాళ్లు ఆమె నుంచి రూ. 7.45 లక్షలు కాజేశారు. సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎమ్‌ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం..  బోరబండకు చెందిన అన్నపూర్ణ ఇటీవల షైన్‌ డాట్‌ కామ్‌ జాబ్‌ సైట్‌లో ఉద్యోగం కోసం పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకుని బయోడేటా అప్‌లోడ్‌ చేసింది. రెండు రోజుల క్రితం రాహుల్‌ జైన్‌ అనే వ్యక్తి ఆమెకు కాల్‌ చేసి ‘మీరు జియో కస్టమర్‌ కేర్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆన్‌లైన్‌ ద్వారా ప్రాసెసింగ్‌ చార్జీలు చెల్లిస్తే అపాయింట్‌మెంట్‌ కన్ఫార్మ్‌ చేసి  అఫీషియల్‌ మెయిల్‌ నుంచి లెటర్‌ పంపిస్తాం’ అని నమ్మబలికాడు. మొదట రూ.లక్ష  తర్వాత యాభైవేలు.. అలా ఆ ఫీజు ఈ  ఫీజు అంటూ రూ. 7.45 లక్షలు వసూల్‌ చేసిన తర్వాత ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. మోసపోయానని గ్రహించిన యువతి సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది.

Updated Date - 2021-07-01T20:16:15+05:30 IST