ఎన్నారైని మోసగించేందుకు సైబర్ నేరగాళ్ల ప్లాన్..! చివరకు..

ABN , First Publish Date - 2022-06-27T02:56:45+05:30 IST

ఓ ఎన్నారై పేర నకిలీ ఈమెయిల్ అకౌంట్ సృష్టించి ఆయన బ్యాంక్ ఖాతాలో నగదును చోరీ చేయబోయిన సైబర్ నేరగాళ్ల ప్లాన్ చివరకు విఫలమైంది.

ఎన్నారైని మోసగించేందుకు సైబర్ నేరగాళ్ల ప్లాన్..! చివరకు..

ఎన్నారై డెస్క్: ఓ ఎన్నారై పేర నకిలీ ఈమెయిల్ అకౌంట్ సృష్టించి ఆయన బ్యాంక్ ఖాతాలో నగదును చోరీ చేయబోయిన సైబర్ నేరగాళ్ల ప్లాన్ చివరకు విఫలమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. లక్నోకు చెందిన అభిజిత్ మజుందార్ అమెరికాలోని పార్క్ యూనివర్శిటీలో జర్నలిజం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ఓ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉంది. అయితే.. ఇటీవల ఓ రోజు అభిజిత్ పేర బ్యాంకుకు ఓ ఈమెయిల్ అందింది. ఆయన బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులు చేయాలంటూ ఈమెయిల్‌లో సూచనలు ఉన్నాయి. దీంతో.. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు బ్యాంకు అధికారులు అభిజిత్‌ను సంప్రదించారు. తన అకౌంట్ వివరాలు మార్చాలనుకుంటున్నారా అని అడిగారు. దీంతో.. అది ఫేక్ ఈమెయిల్ అని గుర్తించిన అభిజిత్ షాకైపోయారు. తాను అటువంటి ఈమెయిల్ ఏదీ పంపించలేదని బ్యాంకు అధికారులకు చెప్పిన ఆయన ఆ తరువాత లక్నోకు చేరుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-06-27T02:56:45+05:30 IST