సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తులు
ABN , First Publish Date - 2021-05-11T12:13:15+05:30 IST
నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో
హైదరాబాద్/బర్కత్‌పుర : నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు ఉన్న సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆ సంస్థ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సాయి శ్రీమాన్‌రెడ్డి తెలిపారు. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ డిప్లొమా, పోస్టు డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ కోర్సులలో శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇంటర్. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని, సైబర్ సెక్యూరిటీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈనెల 27లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, వివరాలకు ఫోన్ 7893141797 ను సంప్రదించాలన్నారు.