Cyber crime: తనతో పెళ్లి తిరస్కరించిందని యువకుడి దారుణం...మార్ఫింగ్ చేసిన వివాహిత అశ్లీల వీడియో పోస్ట్

ABN , First Publish Date - 2022-07-19T14:29:17+05:30 IST

తనను పెళ్లాడేందుకు నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు తన మాజీ ప్రియురాలి మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియోను...

Cyber crime: తనతో పెళ్లి తిరస్కరించిందని యువకుడి దారుణం...మార్ఫింగ్ చేసిన వివాహిత అశ్లీల వీడియో పోస్ట్

న్యూఢిల్లీ:  తనను పెళ్లాడేందుకు నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు తన మాజీ ప్రియురాలి మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియోను(morphed obscene videos) సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఉదంతం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది.ఈ నేరాన్ని సైబర్ క్రైం(Cyber crime) పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీ(delhi) నగరంలోని వజీరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు (woman)ఇటీవల వివాహమైంది. గతంలో తనను వివాహం చేసుకోవాలని కోరిన ఓ యువకుడిని తాను తిరస్కరించాననే కోపంతో మార్ఫింగ్ చేసిన తన అశ్లీల వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త, స్నేహితులు, అత్తమామల కుటుంబ సభ్యులకు పంపించాడని వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.నిందితుడు తన సోషల్ మీడియా స్నేహితులకు నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సృష్టించి ఈ వీడియోలను పంపి తనను నిరంతరం వేధిస్తున్నాడని వివాహిత తన ఫిర్యాదులో పేర్కొంది.


వివాహిత ఫిర్యాదు మేరకు సైబర్‌ (Cyber) నార్త్‌ పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ వివరాల ఆధారంగా ఐపీ చిరునామా, మొబైల్ నంబర్లను పోలీసులు గుర్తించారు. నిందితుడు అంకిత్ బన్సాల్ అని నిర్ధారించారు.ఈ నిందితుడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నివాసముంటున్న ఢిల్లీలోని తుగ్లకాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.విచారణలో నిందితుడి కుటుంబం నుంచి బాధితురాలికి గతంలో వివాహ ప్రతిపాదన వచ్చిందని, అయితే అతని నేర నేపథ్యం కారణంగా దానిని తిరస్కరించినట్లు వెల్లడైంది.సాంకేతిక నిఘా ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన సిమ్ కార్డ్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు అంకిత్ బన్సాల్‌ను విచారించగా తాను కొంతకాలం క్రితం బాధితురాలి మామను కలిశానని అంగీకరించాడు.


 నిందితుడిపై అత్యాచారం కేసు నమోదైన విషయం బాధితురాలి మేనమామకు తెలియడంతో పెళ్లి కుదరలేదు.ఆమె వివాహం తర్వాత నిందితుడు ఆమె వివాహాన్ని విచ్ఛిన్నం చేసి ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం ఫేక్ ఇన్‌స్టాగ్రామ్(instagram) ఐడీని తయారు చేసి, బాధితురాలి పాత చిత్రాలను ఉపయోగించి ఇంటర్నెట్‌లో(internet) నగ్న చిత్రాలను డౌన్‌లోడ్ చేసి నకిలీ వీడియోను రూపొందించాడు.అతను ఈ వీడియోను పంపించాడు.  బాధితురాలి ఇమేజ్‌ను కించపరిచేలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె భర్త, అతని కుటుంబం ముందు ఉంచి పుకార్లు వ్యాప్తి చేయడం ప్రారంభించాడు.గతంలో నిందితుడు అంకిత్ బన్సాల్ కు ఢిల్లీలోని గోవింద్ పురిలో నమోదైన అత్యాచారం కేసులో ప్రమేయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.దీంతో ఢిల్లీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-07-19T14:29:17+05:30 IST