శ్రీనగర్: కాశ్మీర్లోని సైబర్ పోలీసులు ఆన్లైన్ మోసగాళ్ల నుంచి రూ.30 లక్షలను రికవరీ చేశారు. ఆన్లైన్ మోసగాళ్లు విదేశీ కరెన్సీగా మార్చే ప్రక్రియలో ఉన్న రూ.30 లక్షలను కాశ్మీర్లోని సైబర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్ నగరంలోని ఒక సీనియర్ సిటిజన్ కాశ్మీర్ సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండానే తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.11 లక్షలు మోసపూరితంగా విత్డ్రా చేయబడిందని పేర్కొన్నారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందిన వెంటనే సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు ప్రతినిధి శుక్రవారం తెలిపారు.
ఇవి కూడా చదవండి