సైబర్‌ మోసాలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి

ABN , First Publish Date - 2022-08-12T04:20:48+05:30 IST

సైబర్‌ మోసాలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో మహిళా భద్రత విభాగం, తెలంగాణ పోలీస్‌ నిర్వహించిన సైబర్‌ కాంగ్రెస్‌ కార్య క్రమంలో కలెక్టర్‌, డీసీపీ అఖిల్‌ మహజన్‌ పాల్గొన్నారు. జిల్లాలోని పాఠశాలల విద్యార్థులను సైబర్‌ అంబాసిడర్‌లుగా ఎంపిక చేసి అవగాహన కల్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సైబర్‌ నేరాలంటే ఆర్థిక మోసాలే కాకుండా మహిళలు, బాలికల బ్లాక్‌మెయిల్‌, బెదిరింపులకు పాల్పడడం వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నా రు.

సైబర్‌ మోసాలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళికేరి

ఏసీసీ, ఆగస్టు 11: సైబర్‌ మోసాలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. గురువారం  జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో మహిళా భద్రత విభాగం, తెలంగాణ పోలీస్‌ నిర్వహించిన సైబర్‌ కాంగ్రెస్‌ కార్య క్రమంలో కలెక్టర్‌, డీసీపీ అఖిల్‌ మహజన్‌ పాల్గొన్నారు. జిల్లాలోని పాఠశాలల విద్యార్థులను సైబర్‌ అంబాసిడర్‌లుగా ఎంపిక చేసి అవగాహన  కల్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సైబర్‌ నేరాలంటే ఆర్థిక మోసాలే కాకుండా మహిళలు, బాలికల బ్లాక్‌మెయిల్‌, బెదిరింపులకు పాల్పడడం వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నా రు. సైబర్‌ అంబాసిడర్‌లుగా శిక్షణ పొందిన విద్యార్థులు ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. డీసీపీ మాట్లాడుతూ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు అకౌంట్‌, ఓటీపీ, ఆధార్‌, పాన్‌ వివరాలు తెలపవద్దని, ఆన్‌లైన్‌ లింకులను, మెసేజ్‌లను ఓపెన్‌ చేయవద్దని సూచించారు. సైబర్‌ మోసాలకు గురైతే వెంటనే 1930లో ఫిర్యాదు చేయాలన్నారు. మహిళలు, బాలికలు సోషల్‌ మీడియాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు సైబర్‌ క్రైంలను ఎదుర్కోవడంపై నిర్వహించిన ఎగ్జిబిషన్‌, ప్రదర్శించిన నాటికలు విద్యార్థులను చైతన్యపరిచాయన్నారు. సైబర్‌ కాంగ్రెస్‌ అంబాసిడర్స్‌గా ఎంపిక కాబడిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. భీమిని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలకు చెందిన కే శ్రీయ ప్రథమ, పారుపల్లి జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన కె మహేశ్వరి ద్వితీయ, బెల్లంపల్లి జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన మీనాక్షి తృతీయ బహుమతులు సాధించారు. ఏసీపీ తిరుపతిరెడ్డి, సైబర్‌ క్రైం సీఐ రాజేంద్రప్రసాద్‌, మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ శ్రీనివాస్‌, డీఈవో వెంకటేశ్వర్లు, నోడల్‌ అధికారి పద్మజ, డబ్ల్యూఎస్‌ఐ సంధ్యారాణి, షీటీం సిబ్బంది,  పాల్గొన్నారు.  

 

Updated Date - 2022-08-12T04:20:48+05:30 IST