గుంటూరు: యువతులను మోసం చేస్తన్న ఓ సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి యువతులను మోసం చేస్తున్న రాంప్రకాష్‌ను నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేసారు. ఓ యువతి నుంచి 85 వేల రూపాయలను నిందితుడు రాంప్రకాష్ వసూలు చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో రాంప్రకాష్‌ను అరెస్ట్ చేశామని నగరంపాలెం సీఐ హైమారావు తెలిపారు.