హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

ABN , First Publish Date - 2020-09-15T01:03:04+05:30 IST

భాగ్యనగరంలో రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ మధ్యే

హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్ : భాగ్యనగరంలో రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ మధ్యే కేటుగాళ్లు నగరంలో భారీ మోసాలకు పాల్పడ్డారు. ఇవాళ రూ. 8 లక్షలు మోసం చేశారని బాధిత కుటుంబీకులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే జియో మార్ట్ పేరుతో రూ. 1 లక్ష మోసం జరిగింది. అంతేకాదు.. ఓఎల్ఎక్స్ (Olx) పేరుతో రూ. 2 లక్షల మోసానికి పాల్పడ్డారు. ఓటీపీ, కేవైసీ పేరుతో కూడా 10 మంది నుంచి రూ. 5 లక్షలు మోసం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు అందింది.


మరోవైపు.. ఓ వ్యక్తి డెబిట్ కార్డు కొనిక్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఢిల్లీలో డబ్బులు డ్రా చేసుకున్నారు. వీటితో పాటు ఆన్‌లైన్ డేటింగ్ పేరుతో ఓ మహిళను ఆగంతకుడు వేధిస్తుండటంతో.. బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. పైన చెప్పి అన్నీ కేసులను నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదో నయా మోసం..

హైదరాబాద్‌లో ఇప్పుడు కొందరు దుండగులు నయా మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్‌బుక్‌లో ఉన్న పోలీసు, ప్రభుత్వ అధికారుల ప్రొఫైల్ ఫొటోల తీసుకుని ఆ ఫొటోలతో నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి కొందరు దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఫొటోలతో స్నేహితులకు మనీ అర్జంట్‌గా ఉందంటూ మెసేజ్‌లు చేసి మోసం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది పోలీసులు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలా ఎవరికైనా గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు పంపించాలని కోరితే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఎంక్వయిరీ చేసుకోవాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.

Updated Date - 2020-09-15T01:03:04+05:30 IST