Chennai: మరో సైబర్‌ క్రైమ్‌

ABN , First Publish Date - 2021-11-12T16:49:29+05:30 IST

మాజీ తపాలా అధికారి ఖాతా నుంచి రూ.6.40 లక్షలు దోచేశారు. స్థానిక విరుపాక్షిపురానికి చెందిన మురళీధరన్‌ భార్య వసంతకుమారి (61) మాజీ తపాలా అధికారి. వీరి కుమారుడు మదన్‌ లండన్‌లో

Chennai: మరో సైబర్‌ క్రైమ్‌

                    - మాజీ తపాలా అధికారి ఖాతా నుంచి రూ.6.40 లక్షలు దోచేశారు 


వేలూరు(చెన్నై): మాజీ తపాలా అధికారి ఖాతా నుంచి రూ.6.40 లక్షలు దోచేశారు. స్థానిక విరుపాక్షిపురానికి చెందిన మురళీధరన్‌ భార్య వసంతకుమారి (61) మాజీ తపాలా అధికారి. వీరి కుమారుడు మదన్‌ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. స్థానిక స్టేట్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌ల్లోని ఖాతాలకు మదన్‌ తల్లిదండ్రులకు డబ్బులు పంపుతుంటాడు. ఆ ప్రకారం రూ.10 లక్షలు వారి బ్యాంక్‌ ఖాతాలో ఉన్నాయి. గత నెల 28వ తేదీ సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లో, మీ బ్యాంక్‌ ఖాతాకు పాన్‌ కార్డు నెంబరు జతచేయాలని, లేకపోతే డబ్బులు తీసుకొనేందుకు వీలు కాదు అని ఉంది. దీంతో, ఆ మెసేజ్‌లో ఉన్న వెబ్‌సైట్‌కు వసంతకుమారి బ్యాంక్‌ ఖాతా, పాన్‌కార్డు వివరాలు పంపారు. అనంతరం ఆమెను సంప్రదించిన వ్యక్తి, ఓ సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నెంబరు చెప్పాలని కోరడంతో, ఆమె నెంబరు చెప్పింది. కొద్ది నిముషాల్లోనే వసంతకుమారి ఖాతా నుంచి రూ.6.50 లక్షలు డ్రా చేసినట్టు మెసేజ్‌ వచ్చింది. దీంతో దిగ్ర్భాంతికి గురైన ఆమె బ్యాంక్‌ అధికారులను సంప్రదించగా, తాము ఎలాంటి వివరాలు కోరలేదని బదులిచ్చారు. ఈ వ్యవహారంపై బాధితురాలి ఫిర్యాదుతో క్రైం బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. అలాంటి ఫేక్‌ కాల్స్‌ వచ్చినప్పుడు ప్రజలు బ్యాంక్‌ ఖాతా, పాన్‌ కార్డు వివరాలు చెప్పరాదని, ఇలాంటి మోసాలకు పాల్పడే వారి గురించి 155260 అనే నెంబరుకు సత్వరం ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-11-12T16:49:29+05:30 IST