బెజవాడలో ఘరానా మోసం

ABN , First Publish Date - 2020-09-13T16:02:57+05:30 IST

బెజవాడలో సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. అప్పుల నేపథ్యంలో

బెజవాడలో ఘరానా మోసం

విజయవాడ : బెజవాడలో సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. అప్పుల నేపథ్యంలో కిడ్నీలు అమ్ముకునేందుకు దంపతులు ప్రయత్నించారు. ఈ క్రమంలో దంపతులను మోసం చేసిన నేరగాళ్లు రూ. 16.61 లక్షలు కాజేశారు. గత ఏడాది ఆన్‌లైన్‌లో కిడ్నీ అమ్మకానికి సంబంధించి పలు ఆసుపత్రులను పరిశీలించారు.


దంపతుల అవసరాన్ని గుర్తించిన దుండుగులు కిడ్నీలు రూ. 2 కోట్లు అని ఆఫర్ చేశారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రి పేరుతో దంపతులను మోసం చేశారు. ఇలా వివిధ ఖర్చుల పేరుతో 16.61 లక్షల రూపాయలు నగదు వసూలు చేశారు. ఆటోనగర్‌లో వ్యాపారం చేస్తున్న ఈ దంపతులు మోసపోయామని గుర్తించి పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సైబర్ నేరగాళ్లు కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2020-09-13T16:02:57+05:30 IST