సైబర్‌ నేరాలపై అవగాహన తరగతులు

ABN , First Publish Date - 2022-08-12T05:09:27+05:30 IST

పిల్లల ద్వారా పిల్లలకు అందించే సందేశం బలంగా, వే గంగా ప్రజల్లోకి వెళుతుందని, అందుకే ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణాతరగతులు నిర్వహిస్తోందని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అన్నారు.

సైబర్‌ నేరాలపై అవగాహన తరగతులు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు

- ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 11 : పిల్లల ద్వారా పిల్లలకు అందించే సందేశం బలంగా, వే గంగా ప్రజల్లోకి వెళుతుందని, అందుకే ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణాతరగతులు నిర్వహిస్తోందని ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం సుదర్శన్‌ కన్వెన్షన్‌లో శిక్షణ పొందిన విద్యార్థులతో సైబర్‌ నేరాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు. రాష్ట్రంలోని 1650 ప్రభుత్వ పాఠ శాలల్లోని 3300 మంది విద్యార్థులను ఎంచుకొని వారికి ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా సైబర్‌ నేరాలపై అవగాహన నేరాల నియంత్రణకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామ న్నారు.  మన జిల్లాలోనూ 50 పాఠశాలల్లో 100 మంది విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి సైబర్‌ అంబాసిడర్స్‌గా, సైబర్‌ వారియర్స్‌గా గుర్తింపునిచ్చామని గుర్తు చేశారు. సైబర్‌ నైపుణ్యాలు పొందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులు, స్నేహితులు, తొటివిద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తారన్నారు. ఈ సందర్భంగా సైబర్‌ అంబాసిడర్‌ విద్యార్థులకు నిర్వహించిన రాతపరీక్షలో ఉత్తమమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవర్‌, అదనపు ఎస్పీ ఏ రాములు, డీఎస్పీలు మహేశ్‌, శ్రీనివాసులు, షీ టీమ్‌ ఇన్‌చార్జి హనుమ ప్ప, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T05:09:27+05:30 IST