క్వాయర్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-02-27T06:53:32+05:30 IST

క్వాయర్‌ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలని క్వాయర్‌ బోర్డు రీజనల్‌ ఆఫీసర్‌ కె.దశరథరావు కోరారు.

క్వాయర్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి

మామిడికుదురు, ఫిబ్రవరి 26: క్వాయర్‌ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలని క్వాయర్‌ బోర్డు రీజనల్‌ ఆఫీసర్‌ కె.దశరథరావు కోరారు. బి.దొడ్డవరంలోని బీసీ సామాజిక భవనంలో సర్పంచ్‌ చెల్లుబోయిన రామశివసుబ్రహ్మణ్యం అధ్యక్షతన శుక్రవారం వ్యవస్థాపకత అభివృద్ధి కార్యక్రమం జరిగింది. దశరథరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కల్పనలో భాగంగా పరి శ్రమలు ఏర్పాటుచేసే వారితో పాటు శిక్షణ పొందిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, రూ.25లక్షలు యూనిట్‌ విలువతో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి 35 శాతం సబ్సిడీని క్వాయర్‌ బోర్డు ఇస్తుందన్నారు. దీనిలో 5 శాతం లబ్ధిదారుని వాటా కాగా మిగిలిన 60శాతం బ్యాంకు రుణంగా ఇస్తుందని తెలిపారు. వేగి వెంకటేశ్వరరావు, ఉపసర్పంచ్‌ తోట నాగలక్ష్మి, కాండ్రేగుల శ్రీనివాస్‌, పసుపులేటి మహలక్ష్మిరావు, శెట్టిం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కొబ్బరిలో కొత్తవంగడాలను పునరుద్ధరించాలి

అంబాజీపేట, ఫిబ్రవరి 26: అంతర్జాతీయ స్థాయిలో కొబ్బరికి ఉన్న డిమాండ్‌ను అధిగమించేందుకు దేశంలో ఉన్న 21.5లక్షల హెక్టార్లలో కొత్త వంగడాలను ఏర్పాటుచేసి మరింత సాగు పెంచేలా కృషి చేయాలని న్యూఢిల్లీకి చెందిన ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఏకే సింగ్‌ శాస్త్రవేత్తలను కోరారు. కొబ్బరి ఉత్పత్తి-విలువ ఆధారిత ఉత్పత్తులపై శుక్రవారం అంతర్జాల సదస్సు నిర్వహించారు. స్థానిక ఉద్యానవన పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్‌ బీవీకే భగవాన్‌ స్వాగతోపన్యాసం చేయగా ఐసీఏఆర్‌ శాస్త్రవేత్తలు, ఉద్యావన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. కొబ్బరి తోటల్లో కొత్తగా నాణ్యమైన మొక్కలను రైతులకు అందించడానికి వ్యాపారులతో ఒప్పందం కుదిరనట్టు తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తి విధానం, జీవనియంత్రణ ద్వారా కొబ్బరిని ఆశించే పురుగుల నివారణ మొదలైన అంశాలపై చర్చించారు. 


Updated Date - 2021-02-27T06:53:32+05:30 IST