కట్‌లెట్‌లు

ABN , First Publish Date - 2022-02-05T18:53:21+05:30 IST

అన్నం - రెండు కప్పులు, ఓట్స్‌ - ఒక కప్పు, క్యారెట్‌ తురుము - ఒక కప్పు, పుదీనా - ఒక కప్పు, ధనియాల పొడి - ఒక టీస్పూను, కారం - రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత.

కట్‌లెట్‌లు

కావలసినవి: అన్నం - రెండు కప్పులు, ఓట్స్‌ - ఒక  కప్పు, క్యారెట్‌ తురుము - ఒక కప్పు, పుదీనా - ఒక కప్పు, ధనియాల పొడి - ఒక టీస్పూను, కారం - రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత.


తయారీ విధానం: ఒక ప్లేట్‌లో అన్నం తీసుకుని అందులో ఓట్స్‌, క్యారెట్‌ తురుము, పుదీనా, ధనియాల పొడి, కారం, తగినంత ఉప్పు వేసి, కొన్ని వేడి నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ అరచేతిలో కాస్త వెడల్పుగా ఒత్తుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక వాటిని వేసి వేయించాలి. వేడి వేడిగా తింటే ఈ కట్‌లెట్‌లు రుచిగా ఉంటాయి.

Updated Date - 2022-02-05T18:53:21+05:30 IST