Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

కట్‌లెట్స్‌

కట్‌లెట్స్‌

కావలసినవి: రవ్వ చేపలు - అరకిలో, అల్లం ముక్కలు - అర అంగుళం ముక్కలు రెండు, పచ్చిమిర్చి - నాలుగు, వెల్లుల్లి రెబ్బలు - మూడు, బ్రెడ్‌ ముక్కలు - 100గ్రా., కోడిగుడ్డు - ఒకటి,  పుదీనా - ఒకకట్ట, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, సోంపు - ఒక టీస్పూన్‌, మిరియాలు - నాలుగైదు, నూనె - సరిపడా, నిమ్మరసం - అర టీస్పూన్‌, బంగాళదుంప - ఒకటి, మైదా - రెండు టేబుల్‌స్పూన్లు.


తయారీ: స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి నీళ్లు పోసి అల్లం ముక్క, ఒక వెల్లుల్లి రెబ్బ, రెండు పచ్చిమిర్చి వేసి మరిగించాలి. ఆ పాత్రలో ఆవిరి పాత్రపెట్టి చేప ముక్కలను ఆవిరిపై ఉడికించాలి. బ్రెడ్‌ ముక్కలు, కోడిగుడ్డు, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, మిగిలిన పచ్చిమిర్చి, పుదీనా, తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బ్లెండర్‌లో బాగా కలుపుకోవాలి. తరువాత మిరియాలు, సోంపు బాగా దంచి వేయాలి. ఇప్పుడు ఆవిరిపై ఉడికించిన చేప ముక్కలు వేసి మరొక్కసారి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. బంగాళదుంపను ఉడికించి గుజ్జుగా చేసి వేయాలి. మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇప్పుడు కట్‌లెట్‌ల మాదిరిగా చేసుకుంటూ పొడి పిండి అద్దాలి. తరువాత పది నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక కట్‌లెట్లు వేసి డీప్‌ ఫ్రై చేసుకోవాలి. పుదీనాతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

కబాబ్స్‌కబాబ్స్‌మటన్‌ రోస్ట్‌మటన్‌ రోస్ట్‌మటన్‌ కట్‌లెట్స్‌మటన్‌ కట్‌లెట్స్‌వర్క్యూ లుక్మేవర్క్యూ లుక్మేటర్పెండో పెప్పర్టర్పెండో పెప్పర్భార్వాన్‌ టంగ్డిభార్వాన్‌ టంగ్డిగిలౌటి కబాబ్‌ విత్‌ ఉల్టా తవ్వా కా పరోటాగిలౌటి కబాబ్‌ విత్‌ ఉల్టా తవ్వా కా పరోటాఅన్నానేటివ్‌ కోడి కారమ్‌ చిప్స్‌అన్నానేటివ్‌ కోడి కారమ్‌ చిప్స్‌టిక్కాటిక్కామంచూరియామంచూరియా
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.