ధరలు తగ్గించి అమ్మాలి..తరుణోపాయం ఇదే: కేంద్ర మంత్రి సూచన

ABN , First Publish Date - 2020-06-05T00:17:43+05:30 IST

లాక్ డౌన్ దెబ్బకు ప్రజల జేబూల్లోని ధనం ఆవిరైపోయింది. వస్తువులకు డిమాండ్ పడిపోయింది. దీంతో అన్ని రంగాల్లో స్థబ్ధత నెలకొంది. అమ్మకాలు లేక వ్యాపారులు నష్టాలను మూటకట్టుకుంటున్నారు. రియలెస్టేట్ రంగం పరిస్థితి కూడా ఇంతే. ఈ నేపథ్యంలో జరిగిన ఓ వెబినార్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రియాల్టర్లకు కీలక సూచనలు చేశారు.

ధరలు తగ్గించి అమ్మాలి..తరుణోపాయం ఇదే:  కేంద్ర మంత్రి సూచన

న్యూఢిల్లీ: లాక్ డౌన్ దెబ్బకు ప్రజల జేబూల్లోని ధనం ఆవిరైపోయింది. వస్తువులకు డిమాండ్ పడిపోయింది. దీంతో అన్ని రంగాల్లో స్థబ్ధత నెలకొంది. అమ్మకాలు లేక వ్యాపారులు నష్టాలను మూటకట్టుకుంటున్నారు.  రియలెస్టేట్ రంగం పరిస్థితి కూడా ఇంతే. ఈ నేపథ్యంలో జరిగిన ఓ వెబినార్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రియాల్టర్లకు కీలక సూచనలు చేశారు. మార్కెట్ పుంజుకునే వరకూ వేచిచూడకుండా.. ధరలు తగ్గించి అమ్ముతూ పేరుకుపోయిన ఫ్లాట్ల‌ను వదిలించుకోవాలని సూచించారు. ‘ప్రస్తుతం పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి. ధరలు తగ్గించి అమ్మడమే దీనికి తగ్గ ఉపాయం. మార్కెట్ పుంజుకునే వరకూ ప్రభుత్వం సాయం చేయాలని రియలెస్టేట్ సంస్థలు ఆశించకూడదు. ధరలు తగ్గించి అమ్ముతూ ఇంన్వెటరీని(అమ్మకాలు లేక మిగిలిపోయిన ఫ్లాట్లు, ప్లాట్లు) వదిలించుకోవాలి’ అని ఆయన సూచించారు. 

Updated Date - 2020-06-05T00:17:43+05:30 IST