Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోపంతో రగిలిపోయిన హోటల్ కస్టమర్.. వేడి వేడిగా సూప్ తీసుకొని హోటల్ మేనేజర్ ముఖంపై విసరికొట్టింది.. వైరల్ అయిన షాకింగ్ వీడియో

సోషల్ మీడియా ఫుణ్యమా అని ప్రపంచమంతా జరిగే వింతలూ విశేషాలూ మనం రోజూ చూడగలుగుతున్నాం. తాజాగా అమెరికాలో జరిగిన ఒక సంఘటన టిక్ టాక్‌లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక రెస్టారెంట్ కస్టమర్ తనకు కలిగిన ఇబ్బందిని వివరించడానకి ఆ హోటల్ మేనేజర్‌తో కలుస్తోంది. ఆ మేనేజర్ తను చెసే ఫిర్యాదుకు బదులిస్తుండగా ఆ కస్టమర్ తన చేతిలో వేడి వేడి సూప్‌ని మేనేజర్ ముఖంపై విసిరి కొట్టింది.  ఈ షాకింగ్ దృశ్యం అక్కడ ఉన్న సీసీటీవిలో రికార్డ్ అయిపోయింది. అసలు ఆ కస్టమర్‌కు కలిగిన ఇబ్బంది ఏమిటో తెలుసా?..


అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న ఒక మెక్సికన్ రెస్టారెంట్‌ 'సోల్ డీ జలిస్కో ఇన్ టెంపుల్'లో ఇటీవల ఒక లేడీ కస్టమర్ వెళ్లి అక్కడి మెనూలోని స్పైసీ మెనూడో సూప్‌ని పార్శిల్(టేవ్ అవే) ఆర్డర్ చేసింది. ఆ సూప్ అక్కడ చాలా ఫేమస్. చాలా స్పైసీగా ఉంటుందట. ఆ రెస్టారెంట్ వారు ఆ సూప్‌ని ఒక ప్లాస్టిక్ కంటెయినర్‌లో పార్శిల్ చేసి ఇచ్చారు. ఆ లేడీ కస్టమర్ ఆ పార్శిల్‌ని తీసుకొని చూడగా.. బాగా వేడిగా ఉండటంతో పార్శిల్ ప్లాస్టిక్ మూత వేడికి కాస్త కరిగిపోయింది. అక్కడున్న సిబ్బందిని దాని గురించి అడిగితే.. మేనేజర్‌కు ఫిర్యాదు చేయమన్నారు. దీంతో ఆ కస్టమర్ ఆ రెస్టారెంట్ మేనేజర్ జానిల్ బ్రోలాండ్‌ని వద్దకు వెళ్లింది.


జానిల్ ఆ రెస్టారెంట్‌లో గత కొద్ది కాలంగా మేనేజర్ పని చేస్తోంది. ఆ లేడి కస్టమర్ జానిల్ వద్దకు వచ్చి పార్శిల్ కంటెయినర్ చాలా తక్కువ క్వాలిటీ ప్లాస్టిక్‌తో తయారుబడిన కారణంగా అది వేడికి కరిగి పోతోందని చూపించింది. దానికి ఆ మేనేజర్ కాసేపు ఆగండి నేను మీ ఫిర్యాదు గురించి చూస్తాను అని చెప్పింది. అప్పటికీ బాగా కోపంలో ఉన్న ఆ లేడి కస్టమర్‌కు సహనం నశించి ఆ వేడి వేడి సూప్‌ని మేనేజర్ జానిల్ ముఖంపై విసిరి కొట్టి.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది.


జానిల్ ఆ సంఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తన కళ్లో వేడి వేడి సూప్ పడింది.. పైగా అది చాలా కారం ఉండటంతో కళ్లలో మంట కలిగి అక్కడి నుంచి బాత్‌రూమ్ వైపు అరుపులు వేస్తూ పరుగులు తీసింది. ఈ సంఘటన ఆ రెస్టారెంట్ సీసీటీవి వీడియోలో రికార్డ్ అయింది. ఆ లేడీ కస్టమర్‌పై ఆ రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


ఆ లేడీ కస్టమర్ కారు నెంబర్ సీసీటీవి వీడియో ఆధారంగా తెలుసుకున్నామని, త్వరలోనే ఆమెను పట్టుకుంటామని టెక్సాస్ పోలీస్ చీఫ్ చెప్పారు. ఏమైనా ఫిర్యాదులుంటే సివిల్ కేసు పెట్టుకోవచ్చని, కానీ ఇలా హింసాత్మక ప్రవర్తిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement