అంతా మీవల్లేనంటూ కోర్టుమెట్లెక్కిన కస్టమర్.. కారణమేంటో విని నివ్వెరపోయిన హోటల్ యాజమాన్యం..!

ABN , First Publish Date - 2022-04-16T18:09:41+05:30 IST

ఓ రోజు అనుకోకుండా వొచ్చిన కోర్టు సమన్లను చూసి హోటల్ యాజమాన్యం నివ్వెరపోయింది. తమ పాత కస్టమర్ ఒకతను హోటల్‌పై దావా వేసినట్టు గుర్తించి షాకైంది. అందుకు గల కారణాన్ని తెలుసుకుని విస్తుపోయింది. కస్టమర్‌ చేస్తున్న ఆరోపణల

అంతా మీవల్లేనంటూ కోర్టుమెట్లెక్కిన కస్టమర్.. కారణమేంటో విని నివ్వెరపోయిన హోటల్ యాజమాన్యం..!

ఇంటర్నెట్ డెస్క్: ఓ రోజు అనుకోకుండా వొచ్చిన కోర్టు సమన్లను చూసి హోటల్ యాజమాన్యం నివ్వెరపోయింది. తమ పాత కస్టమర్ ఒకతను హోటల్‌పై దావా వేసినట్టు గుర్తించి షాకైంది. అందుకు గల కారణాన్ని తెలుసుకుని విస్తుపోయింది. కస్టమర్‌ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టేందుకు సిద్ధం అవుతోంది. అసలు కస్టమర్ హోటల్‌‌కు వ్యతిరేకంగా ఎందుకు కోర్టు మెట్లెక్కాడు. అతడికి జరిగిన నష్టం ఏంటి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


2021 జులై.. అపుడు అమెరికాలో కొవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఆ క్రమంలో క్వారెంటైన్ నిబంధనల కారణమో లేక ఇతర కారణమో తప్పనిసరి పరిస్థితుల్లో ఒహియో రాష్ట్రానికి చెందిన వాన్సికిల్ అనే వ్యక్తి హోటల్‌లో బస చేయాల్సి వచ్చింది. దీంతో Myrtle Beachలో ఉన్న సాండ్స్ ఓసియన్ క్లబ్ రిసార్టును సందర్శించాడు. గదిని అద్దెకు తీసుకుని అందులో బస చేశాడు. గదిలో అతడు నిద్రిస్తున్న వేళ అకస్మాత్తుగా అతడికి చెవిపోటు వొచ్చింది.  దీంతో అతడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాడు. ఈ క్రమంలో వైద్య పరీక్షలు చేసిన డాక్టర్.. అతడి చెవి నుంచి బొద్దింకను బయటకు తీశాడు. 



అయితే కొద్ది రోజులు గడిచిన తర్వాత కూడా అతడికి చెవి నొప్పి అస్సలు తగ్గకపోగా.. క్రమంగా వినికిడి శక్తి మందగించింది. ఈ క్రమంలో తాజాగా అతడు కోర్టును ఆశ్రయించాడు. హోటల్‌పై దావా వేశాడు. హోటల్ నిర్వాహణ లోపం వల్లే తాను వినికిడి శక్తిని కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించాడు. ఫలితంగా ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేక సరిగా పని చేయలేకపోతున్నాని దీంతో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాని పేర్కొన్నాడు. తన చికిత్సకు అయిన మొత్తంతోపాటు తనకు జరిగిన నష్టానికి హోటల్ నుంచి పరిహారం ఇప్పించాలని కోర్టును కోరాడు. దీంతో స్పందించిన కోర్టు.. హోటల్ యాజమాన్యానికి సమన్లు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని అందులో ఆదేశించింది. కాగా.. కోర్టు నుంచి వచ్చిన సమన్లను చూసి, యాజమాన్యం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 




Updated Date - 2022-04-16T18:09:41+05:30 IST