కార్వీకి హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2020-09-15T05:44:16+05:30 IST

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎ్‌సబీఎల్‌)కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. వాటాదారుల

కార్వీకి  హైకోర్టులో ఊరట

 ఎస్‌ఎ్‌ఫఐఓ విచారణపై స్టే 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎ్‌సబీఎల్‌)కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. వాటాదారుల నిధులను మళ్లించి దుర్వినియోగానికి పాల్పడిందనే అభియోగాలపై సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎ్‌ఫఐఓ) విచారణకు ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది.


ఎస్‌ఎ్‌ఫఐఓ విచారణ కు సంబంధించి కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి త్వ శాఖ, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్ల మధ్య జరిగిన కరస్పాండెన్స్‌కు సంబంధించిన పత్రాలను కోర్టు ముందుంచాలని అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌ రాజేశ్వర రావుకు స్పష్టం చేసింది.


తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌ రెడ్డి తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై కార్వీ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా, దీనిని విచారించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి కార్వీ సంస్థ పిటిషన్లను కొట్టివేసిన విషయం విదితమే. సింగిల్‌ జడ్జి ఆదేశాలపై కార్వీ డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేసింది. దీన్ని విచారించిన ధర్మాసనం ఎస్‌ఎ్‌ఫఐఓ విచారణపై స్టే ఆదేశాలు జారీ చేసింది. 


Updated Date - 2020-09-15T05:44:16+05:30 IST