కాటేస్తున్న కరెంట్‌

ABN , First Publish Date - 2021-06-24T04:45:13+05:30 IST

జిల్లాలో విద్యుత్‌ ప్రమాదాలు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట చోటు చేసుకుంటున్నాయి.

కాటేస్తున్న కరెంట్‌
లోగో

-జిల్లాలో పెరుగుతున్న విద్యుత్‌ ప్రమాదాలు
-గడిచిన 18 నెలల్లో 28 మంది మృతి
- 168 మూగజీవాల మృత్యువాత
-వ్యవసాయ పొలాల్లో అత్యధికంగా ప్రమాదాలు
-అధికారులు పట్టించుకోవడం లేదని బాధితుల ఆవేదన

బెల్లంపల్లి, జూన్‌ 23: జిల్లాలో విద్యుత్‌ ప్రమాదాలు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట చోటు చేసుకుంటున్నాయి. విద్యుదాఘాతంతో మనుషులు ప్రా ణాలు కోల్పోతున్నారు. పశువులు మృత్యువాత పడుతున్నాయి. విద్యుత్‌ ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపో వడం, నిర్లక్ష్యం, అజాగ్రత్త తదితర కారణాలతో విద్యుత్‌ ప్రమాదాలు సంభవిస్తు న్నాయి. గడిచిన 18 నెలల కాలంలో  జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో 28 మంది మనుషులు మృతి చెందారు. 168 పశువులు విద్యుత్‌ షాక్‌తో మృత్యువాతపడ్డాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రమాదా లు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వ్యవసాయ పొలాల్లో పశువు లతో పాటు మనుషులు విద్యుత్‌ ప్రమాదాలకు బలవుతున్నారు. ఈ మరణాల్లో  సగానికి పైగా విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయని బాధితులు వాపోతున్నారు. పలు చోట్ల చేతికి అందే ఎత్తులో విద్యుత్‌ తీగలు ఉండడం విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ల చుట్టూ కంచె లు లేకపోవడం,  కరెంటు వైర్లు తెగి పొలాల్లో కింద పడడం తదితర కారణాలతో విద్యుత్‌ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.


అధికారుల నిర్లక్ష్యం..
విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం, రైతుల్లో అవగాహన లేకపోవడంతో జిల్లాలో యేటా విద్యుత్‌ ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా ప్రమాదాలకు ఎన్నో ఏండ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాలు, పలు ప్రాంతాల్లో విద్యుత్‌ ఎర్త్‌వైర్లు ఇష్టారాజ్యాంగా ఉండడమేనని గ్రామస్థులు చెబుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ కంచెలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్‌ వైర్లు గాలి దుమా రానికి తెగిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్‌లకు రక్షణ కంచెలు లేకపోవడంతో మూగజీవాలతో పాటు రైతులు అటు వైపుగా వెళ్లి మృత్యువాత పడిన ఘటనలు చోటు చేసు కున్నాయి. అంతేకాకుండా ఇళ్ల సమీపం నుంచి 11 కేవీ విద్యుత్‌ వైర్లు ఉండడం, డాబాపైకి ఎక్కి బట్టలు ఆరేసే సమయంలో చేతులకు విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌తో మనుషులు మృత్యువాత పడు తున్న సంఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు వివిధ పనులు చేయడానికి సిద్ధమవుతు న్నారు. పొలాల్లో నీటి కోసం విద్యుత్‌ మోటా ర్లు ఆన్‌ చేసేటప్పుడు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడి విద్యుత్‌ తీగలు తెగి ఉండడం గుర్తించకుండా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదా ల్లో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం విద్యుత్‌ ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్ష లు, మూగ జీవాలకు రూ. 40 వేలు అందజేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి శాఖపరమైన నిబంధనల ప్రకారం ఉంటేనే బాధిత కుటుంబాలకు పరిహారం అందుతుంది.

కుటుంబాల్లో విషాదం..
విద్యుత్‌ ప్రమాదాలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి. వ్యక్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులు పరిహారం రాక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు. వేల రూపాయలు పెట్టి పశువులను కొనుగోలు చేస్తున్నామని, పరి హారం మాత్రం తక్కువ మొత్తంలో వస్తుందని రైతులు చెబుతున్నారు.  సంబం ధిత విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా ప్రమాదాల నివారణకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసు కోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-06-24T04:45:13+05:30 IST