నడిరోడ్డుపై విద్యుత్‌ స్తంభాలు

ABN , First Publish Date - 2022-01-29T05:06:21+05:30 IST

శాఖల మధ్య సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యం కార ణంగా.. కొత్త రోడ్డు వేసిన సంతోషం లేకుండా పోయింది రంగశాయిపేట వాసులకు. నగరం లోని రంగశాయిపేట గడీ సెంటర్‌ నుంచి ఉర్సు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి వరకు గత ఏడాది రోడ్డు నిర్మించారు.

నడిరోడ్డుపై విద్యుత్‌ స్తంభాలు
రోడ్డు మద్యలో ఉన్న విద్యుత్‌ పోల్‌

ప్రమాదాలకు గురవుతున్న వాహనచోదకులు 

నిధులు మంజూరైనా  మొదలుకాని తొలగింపు పనులు


శంభునిపేట, జనవరి 28 : శాఖల మధ్య సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యం కార ణంగా.. కొత్త రోడ్డు వేసిన సంతోషం లేకుండా పోయింది రంగశాయిపేట వాసులకు. నగరం లోని రంగశాయిపేట గడీ సెంటర్‌ నుంచి ఉర్సు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి వరకు గత ఏడాది రోడ్డు నిర్మించారు. రోడ్డు వేసే ముందు విద్యుత్‌ స్తంభాలను పక్కకు జరిపి ప్రణాళిక బద్ధంగా పనులను చేపట్టాలి. కాని ఇక్కడ మునిసిపల్‌ కార్పొరేషన్‌, విద్యుత్‌ శాఖల మధ్య  సమన్వయ లోపం వలన స్తంభాలను పక్కకు జరపకుండా అలాగే ఉంచి సీసీ రోడ్డు వేశారు. రోడ్డు విశాలంగా మారినా, మధ్యలో విద్యుత్‌ స్తంభాలు ఉండటంతో తరచూ  ప్రమాదాలు జరుగుతున్నాయి. 

విద్యుత్‌ తీగలు కిందకు వేలాడుతూ ఉండ టం వలన ఇటీవల ట్రాక్టర్‌లో తీసుకువస్తున్న గడ్డికి విద్యుత్‌ తీగలు తగిలి మంటలు లేచా యి. గడ్డి మొత్తం కాలిపోవటంతో  రైతు నష్ట పోవాల్సివచ్చింది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ సమయ స్పూర్తి, సమయంలో ఫైర్‌ ఇంజన్‌ రావటం వలన పెను ప్రమాదం తప్పింది. లేకుంటే చుట్టు పక్కల ఇళ్లకు నిప్పంటుకునేది. స్తంభాలను రోడ్డు పక్కకు జరిపి అమర్చాలని స్థానికులతో పాటు ప్రజాప్రతినిధులు అధికా రులకు పలుమార్లు తెలిపిన క్రమంలో  గత నెల 23న  విద్యుత్‌ స్తంభాలను పక్కకు జరి పేందుకు విద్యుత్‌ శాఖ నుంచి నిధులు మం జూరు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అయిన ప్పటికీ విద్యుత్‌ స్తంభాలను తొలగించటంలో జాప్యం చేస్తున్నారు. సమస్యపై ఉన్నతాధికా రులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 


కంకర తేలుతున్న సీసీ రోడ్డు

సీసీ రోడ్డు నిర్మాణం జరిగి ఆరు నెలలైనా  కాలేదు, అప్పుడే కంకర తేలుతోంది. రోడ్డు నిర్మాణంలో నాసిరకం కాంక్రీటు వాడినట్లు స్థానికులు చెబుతున్నారు.  మునిసి పల్‌ కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారుల పర్య వేక్షణ లోపం వల్లే ఈ పరిస్థితి దాపురించినట్టు వారు ఆరోపిస్తు న్నారు. శంభునిపేట నుంచి నెహ్రూ విగ్రహం, గడీ సెంటర్‌ ద్వారా ఉర్సు ప్రసూతి ఆసుపత్రి వరకు, అలాగే యాదవవాడ మీదుగా బైపాస్‌ రోడ్డు కలుపుతూ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు రూ.2కోట్ల నిధులను వెచ్చిం చారు.  అనేక ఏళ్ల తర్వాత విస్తరణకు నోచుకున్న ఈ మార్గంలో నాసి రకం రోడ్డు నిర్మాణం జరగడం పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తు న్నారు. బాధ్యులైన అధికారులుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 



Updated Date - 2022-01-29T05:06:21+05:30 IST