కరోనా కట్టడికి కలిసిరండి

ABN , First Publish Date - 2020-04-03T07:29:52+05:30 IST

కరోనా కట్టడి కి ప్రైవేట్‌ ఆస్పత్రులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని గవర్నర్‌ తమిళిసై కోరారు. గురువారం ఆమె రాజ్‌భవన్‌ నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రుల ప్రతినిధులు...

కరోనా కట్టడికి కలిసిరండి

ప్రైవేట్‌ ఆస్పత్రులను కోరిన గవర్నర్‌ తమిళిసై


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడి కి ప్రైవేట్‌ ఆస్పత్రులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని గవర్నర్‌ తమిళిసై కోరారు. గురువారం ఆమె రాజ్‌భవన్‌ నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రుల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ సూచించగా.. అందుకు సంస్థలు సానుకూలంగా స్పందించాయి. కరోనా అనుమానితులు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండేలా చూడటంలో స్వచ్ఛంద సంస్థలు కీలక భూమిక పోషించాలన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ రాజ్‌భవన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పేదలకు ఆహారంతో పాటు మాస్కులు, సబ్బులు పంపిణీ చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా రాజ్‌భవన్‌లో సీతారామచంద్రుల విగ్రహాల వద్ద గవర్నర్‌ దంపతులు పూజలు చేశారు.

Updated Date - 2020-04-03T07:29:52+05:30 IST